Saturday, May 11, 2024

జిన్నా భాయ్ పాత్ర‌ను తెలిపేలా – జిన్నా మూవీ నుండి లిరిక‌ల్ సాంగ్

నా పేరు జిన్నారా అంద‌రికీ అన్న‌రా అంటూ సాగే లిరిక‌ల్ సాంగ్ ని విడుద‌ల చేశారు జిన్నా మూవీ మేక‌ర్స్. విష్ణు హీరోగా ఈ సినిమా రూపొందింది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి ప్రేమ్ సాహిత్యాన్ని అందించగా పృథ్వీ చంద్ర ఆలపించాడు.హీరో స్వభావం .. ఆయన ధైర్య సాహసాలను గురించి స్తుతించే స్టైల్లో ఈ పాట సాగుతోంది. ‘జిన్నాభాయ్’ పాత్రను మాస్ ఆడియన్స్ కి చేరువగా తీసుకుని వెళ్లడానికి విష్ణు గట్టిగానే ట్రై చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆయన సొంత బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించాడు. జి.నాగేశ్వరరెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కోన వెంకట్ స్క్రీన్ ప్లే ను సమకూర్చాడు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టయినర్ లో విష్ణు సరసన నాయికలుగా సన్నీలియోన్ .. పాయల్ అలరించనున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement