Thursday, April 25, 2024

Gandhi Jayanti : జాతిపిత మహాత్మాగాంధీ 153వ జయంతి, ప్రముఖుల నివాళులు

గాంధీజీ 153వ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్కర్‌, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే.. మహాత్ముని సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.

మహాత్మాగాంధీకి ప్రధాని మోదీ ఘన నివాళులు
జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఘన నివాళి అర్పించారు. ఆదివారం రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధి వద్దకు వెళ్ళిన ప్రధాని పుష్పగుచ్చాన్ని ఉంచి నివాళులు తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటానికి గాంధీ నాయకత్వం వహించడం తెలిసిందే. గాంధీ తన ఉద్యమంలో ఎప్పుడూ శాంతికే ప్రాధాన్యం ఇచ్చారు. ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘మహాత్మా గాంధీకి నివాళులు. నేటి గాంధీ జయంతి మరింత ప్రత్యేకం. ఎందుకంటే భారత్ ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటోంది. బాపూ సిద్ధాంతాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. ప్రజలు ఖాదీ, చేతి ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా గాంధీకి నివాళి అర్పించాలి’’అని ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement