Monday, April 29, 2024

యూకేలో గాండీవ‌ధారి అర్జున షూటింగ్.. వైర‌ల్ గా వ‌ర్కింగ్ స్టిల్స్

గ‌రుడ‌వేగ చిత్రంతో హిట్ కొట్టిన ప్ర‌వీణ్ స‌త్తారు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో గాండీవ‌ధారి అర్జున చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటికీ చిత్ర యూనిట్ ఎలాంటి అప్‌డేట్‌ను ఇవ్వలేదు. అయితే ఈ మద్యే వరుణ్‌ తేజ్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని చిత్ర యూనిట్ సినిమా టైటిల్‌తో పాటు వరుణ్‌ తేజ్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాకు గాండీవధారి అర్జున అనే టైటిల్‌ను ఖరారు చేసింది.సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. లండన్‌ బ్రిడ్జ్‌పై యాక్షన్‌ సన్నివేశానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో వరుణ్‌ తేజ్‌ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ గూడచారి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదలైన ఫస్ట్‌ లుక్‌ ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ యూకేలో జరిగింది. అక్కడి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు చిత్రయానిట్. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement