Monday, April 29, 2024

IPL-2024 | లక్నోకు గుడ్​బై చెప్పనున్న గంభీర్​.. కేకేఆర్​ చెంతకు చేరే చాన్స్​!

కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ప్రస్తుతం మెంటార్ గా ఉన్నాడు గంభీర్. లక్నో టీమ్ 2022 సీజన్‌లో అరంగేట్రం చేసింది. లక్నో రెండు సీజన్‌లలో మంచి ప్రదర్శన చేసినా కప్ కొట్ట‌లేక‌పోయారు. దీంతో కోచింగ్‌ స్టాఫ్‌లో భారీ సవరణకు లక్నో జ‌ట్టు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆసీస్ మాజీ ఆటగాడు, కోచ్ జస్టిన్ లాంగర్‌ను లక్నో ప్రధాన కోచ్‌గా నియమించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. లాంగర్ రాకతో గంభీర్ కు జట్టులో పెద్దగా పాత్ర ఉండదు. అందుకే గంభీర్ జట్టు నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

దీంతో గంభీర్ KKR యాజమాన్యంతో చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు. ఐపీఎల్‌లో కేకేఆర్ రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. కాగా, గంభీర్ 2011 నుండి 2017 వరకు KKR కోసం ఆడాడు. అందుకే మాజీ కెప్టెన్ గంభీర్‌ను కోచ్‌గా చేయాలని కేకేఆర్ యోచిస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement