Friday, May 17, 2024

పురాతన ఆలయాలకు పూర్వ వైభవం….అభివృద్ధికి కోటి 98 లక్షల 50 వేల నిధుల మంజూరు..

సిద్దిపేట ప్రతినిధి:- సిద్దిపేట నియోజకవర్గం లో పలు ఆలయాల కు నిధులు మంజూరు అయినట్లు , ఆరు దేవాలయాల అభివృద్ధి కి కోటి 98 లక్షల 50 వేలు నిధులు మంజూరు అయ్యాయని మంత్రి హరీష్ రావు తెలిపారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు.. సీఎం కేసీఆర్ ధార్మిక దార్శనికుడని రాష్ట్రంలో అనేక దేవాలయాల అభివృద్ధి కి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.. సిద్దిపేట నియోజకవర్గం లో ఇప్పటికే 50కి పైగా ఆలయాలు అభివృద్ధి చేసుకున్నామని అదే తరహాలో నియోజకవర్గం లో కొత్తగా మరో ఆరు దేవాలయాల అభివృద్ధి నిధులు మంజూరు చేసుకున్నామని చెప్పారు.. సిద్దిపేట లో పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చామని, ఆలయాలకు, ఆధ్యాత్మిక తకు నెలవు మన సిద్దిపేట అని అన్నారు..

సిద్దిపేట నియోజకవర్గం లో కొత్త గా ఆరు దేవాలయాలు చిన్నకోడూర్ మండలం సలేంద్రి గ్రామంలో అతి పురాతన ప్రాచీన ఆలయం శ్రీ శివాలయం ( రామలింగెశ్వర ) రూ.50 లక్షలు, విఠలాపూర్ గ్రామంలో ని ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన గుట్ట పై వెలిసిన శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయం కు రూ.42 లక్షలు, నారాయణ రావు పేట మండలంలోని పురాతన అలయం శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామీ ఆలయం కు రూ. 39 లక్షలు , సిద్దిపేట పట్టణం లోని శ్రీ పెద్దమ్మ దేవలయం అభివృద్ధి కి రూ.30 లక్షలు, హనుమంతు పల్లి ఇరుకోడ్ లోని పెద్దమ్మ ఆలయం మిగులు పనులకు రూ.20 లక్షలు, సిద్దిపేట అర్భన్ మండలం మిట్టపల్లి గ్రామంలో ని శ్రీ మహంకాళి దేవాలయం రూ.17.50 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు.. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంబిస్తామని వెల్లడించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement