Monday, April 29, 2024

నాని 30వ సినిమాపై ఫుల్ క్రేజ్‌.. జ‌వ‌న‌రి 1న మూవీ అనౌన్స్‌మెంట్‌కి ప్లాన్‌

టాలీవుడ్ లో తనదైన నటనతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ.. నాచురల్ స్టార్ అనే బిరుదు సంపాదించుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాని. తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసిన నాని.. ప్రస్తుతం తన 29వ మాస్ మసాలా.. మొదటి పాన్ ఇండియా సినిమా “దసరా” చేస్తున్నాడు. ఇక ఈ సిినిమా తరువాత నాని చేయనున్న 30వ సినిమా నానికి ఒక మైల్ స్టోన్ గా మారనుంది. తాజాగా, నాని చేయనున్న 30వ సినిమాపై ఒక లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది.

ఈ సినిమాని వైరా ఎంటర్టైన్మెంట్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ నిర్మించనుంది. ఈ బ్యానర్ ని మోహన్ చెరుకూరి తన స్నేహితులు డాక్టర్ విజేందర్ రెడ్డి తేగల, కె ఎస్ మూర్తి లతో కలిసి సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో ఆరంభించారు. ఇక ఈ ప్రాజెక్ట్ పై రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ కూడా మంచి ప్లెజెంట్ గా ఉంది. ఇక ఈ మూవీ అనౌన్సమెంట్ ఈ కొత్త ఏడాది 2023 జనవరి 1న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి అనౌన్స్ చేయనున్నట్టుగా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement