Saturday, May 18, 2024

నానే వ‌రువేన్ చిత్రం నుండి – ధ‌నుశ్ లుక్ పోస్ట‌ర్

త‌మిళ స్టార్ హీరో చేతిలో ప్ర‌స్తుతం మూడు త‌మిళ చిత్రాలు ఉన్నాయి. కాగా వాటిలో ‘నానే వరువేన్ చిత్రం షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని ధనుశ్ స్వయంగా తెలియజేస్తూ, ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. జీప్ పై భాగంలో చాలా స్టైల్ గా ఆయన ఇచ్చిన పోజు ఆకట్టుకుంటోంది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో ధనుశ్ హీరోగాను .. విలన్ గాను కనిపించనుండటం విశేషం. ఈ సినిమా కి ధనుశ్ సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఎల్లి అవ్రామ్ .. ఇందుజా రవిచంద్రన్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా అలరించనున్నారు. ప్రభు .. యోగిబాబు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement