Saturday, April 13, 2024

TS | జూన్‌ 10 నుంచి టీఎస్‌ పీఈసెట్‌.. షెడ్యూల్ రిలీజ్ !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ పీఈసెట్‌-2024 షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌.మల్లేష్‌ సోమవారం విడుదల చేశారు. మార్చి 12వ తేదీన పీఈసెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు లింబాద్రి పేర్కొన్నారు. మార్చి 14 నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారని తెలిపారు.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మే 15గా నిర్ణయించారు. ఆలస్య రుసుముతో మే 31వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించవచ్చని పేర్కొన్నారు. జూన్‌ 10 నుంచి 13వ తేదీ మధ్యలో టీ-ఎస్‌ పీఈసెట్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. టీఎస్‌ పీఈసెట్‌ ద్వారా బీపీఎడ్‌, డీపీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది టీఎస్‌ పీఈసెట్‌ను శాతవాహన యూనివర్సిటీ నిర్వహిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement