Thursday, May 2, 2024

చిల్కా సరస్సుకు విదేశీ అతిథులు.. తరలి వచ్చిన పక్షులతో కళకళ..

ఆసియాలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అయిన చిల్కాకు ప్రతీ సంవత్సరం విదేశాల నుంచి లక్షల సంఖ్యలో పక్షులు తరలివస్తాయి. ఈ సంవత్సరం దాదాపు 11 లక్షల పక్షులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఇండియాలో సముద్ర తీరం వెంట ఉన్న లోతులేని అతిపెద్ద మడుగుగా దీనికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది.పూరి, గంజామ్, ఖోర్డా జిల్లాల్లో విస్తరించివున్న ఈ సరస్సు దాదాపు 1,100 చదరపు కిలోమీటర్లలో ఉంది. గతేడాది 190 జాతులకు చెందిన 11.40 లక్షల పక్షులు రాగా… ఈసారి 183 జాతులకు చెందిన 10,74,173 పక్షులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రతీ సంవత్సరం ఈ సరస్సుకు విదేశీ పక్షులు తరలివస్తుంటే… ఒడిశా ప్రభుత్వం కూడా వాటి ఆవాసానికి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా సరస్సును పరిశుభ్రంగా ఉంచుతోంది. ఈసారి వచ్చిన పక్షుల్లో ఇదివరకు రాని మంగోలియా గుల్ అనే ప‌క్షులు కూడా వ‌చ్చాయి అని సరస్సు అభివృద్ధి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుశాంత నందా తెలిపారు. ఈ టైమ్ లో ఈ ప్ర‌దేశం ఒక్క టూరిస్ట్ ప్లేస్ గా మారుతుంది. ఇక్క‌డ‌కు వ‌ల‌స వ‌చ్చిన‌ పక్షుల్ని చూసేందుకు, తమ కెమెరాల్లో ఆ అరుదైన దృశ్యాల్ని క్లిక్ మ‌నిపించేందుకు పెద్ద సంఖ్యలో ఫొటోగ్రాఫర్లు, టూరిస్టులూ చిల్కాకు వెస్తుంటారు.

ఈసారి వచ్చిన వాటిలో ప్రత్యేక తోక గల బాతులు, ఉత్తర పిన్ టైల్, గాడ్వాల్, యురేసియా విజియన్ పక్షులు లక్షకు పైగా ఉన్నాయని తెలిసింది. ఐతే.. షోవెలెర్, టఫ్టెడ్ డక్, రెడ్ చెస్ట్ పోచర్డ్ జాతుల పక్షులు ఈసారి కొద్దిగా తక్కువ ఉన్నాయి. నార్త్‌రన్ కూట్, కామన్ పోచర్డ్ పక్షులు మాత్రం ఈసారి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇక్కడికే అంతలా ఎందుకు వస్తున్నాయి..?
ఈ సరస్సులో భారీ సంఖ్యలో రకరకాల చేపలుంటాయి. ఈ చేపలపై ఆధారపడి… సరస్సు చుట్టుపక్కల 132 గ్రామాల ప్రజలు జీవిస్తున్నారు. అంతలా చేపలు దొరుకుతాయి కాబట్టి విదేశీ పక్షులు ఇక్కడికి వస్తాయి. పైగా ఈ సమయంలో అక్కడి వాతావరణం ఈ పక్షులకు అనుకూలంగా ఉంటుంది. అక్కడే గూళ్లు కట్టుకొని గుడ్లు పెట్టి సంతానాన్ని అభివృద్ధి చేస్తాయి. అందుకే వేల కిలోమీటర్లు ఎగిరి మరీ ఇక్కడికి వస్తుంటాయి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement