Monday, May 6, 2024

భార్యతో బలవంతపు లైంగిక సంబంధం తప్పు కాదు: ముంబై హైకోర్టు

ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ముంబైలో ఓ మహిళ తన భర్త తనతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, దాని ఫలితంగా ఆమె పక్షవాతం వచ్చిందని ఆరోపించింది. అయితే, ఈ కేసులో ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు వివాదస్పద తీర్పు ఇచ్చింది. బలవంతంగా లైంగిక సంబంధం చట్టవిరుద్ధమైన చర్య కాదని పేర్కొన్న కోర్టు.. నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఈ వార్త కూడా చదవండి: వాట్సాప్ గ్రూప్‌లో పోర్న్ వీడియోల కలకలం.. మహిళలు షాక్


ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ముంబై సమీపంలోని మహాబలేశ్వర్‌‌కు చెందిన ఓ మహిళకు మరో వ్యక్తికి గత ఏడాది నవంబర్‌ 22 న వివాహం అయింది. అయితే పెళ్లి జరిగిన నాటి నుంచి ఆ మహిళను.. ఆమె భర్తతో సహా కుటుంబ సభ్యులు హింసిస్తున్నారు. అదనపు కట్నం తీసుకు రావాలని పీడిస్తున్నారు. అంతేకాదు ఇష్టం లేకుండా బలవంతంగా ఆ మహిళతో పలమార్లు సెక్స్ చేశాడు. దీంతో ఆ మహిళకు నడుము కింది భాగంలో పక్షవాతం వచ్చింది. దీంతో తన భర్తతో సహా ఆ కుటుంబంపై సదరు మహిళ కేసు పెట్టింది. అయితే.. ఈ కేసును తాజాగా ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు విచారించింది. భార్యభర్తల మధ్య బలవంతపు సెక్స్‌ చట్టవిరుద్ధం కాదని ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు స్పష్టం చేసింది.

ఈ వార్త కూడా చదవండి: పెళ్లయిన మహిళకు ప్రేమలేఖ రాసిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

Advertisement

తాజా వార్తలు

Advertisement