Friday, May 3, 2024

Followup : ఆరో రోజూ లాభాల్లో మార్కెట్లు..

వరుసగా ఆరో రోజూ, శుక్రవారం భారతీయ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, ఆర్థికసంస్థల షేర్లు లాభాలు ఆర్జించిపెట్టాయి. భారతీయ మార్కెట్లలో విదేశీ మదుపరుల పెట్టుబడులు గణనీయంగా పెరగడం విశేషం. గడచిన ఏడురోజులలో గరిష్టంగా శుక్రవారం విదేశీ మదుపరులు పెట్టుబడులు పెరిగాయి. ఈ వారం రోజుల్లో దాదాపు 8.32.2 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని వారు భారత మార్కెట్లలో షేర్లు కొనుగోలు చేశారు. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ శుక్రవారం 390.28 పాయింట్లు (0.70) లాభపడి 56,072.33 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌యి నిఫ్టీ 114.20 పాయింట్లు లాభపడి (0.69) 16,719.45 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలోని 15 రంగాల షేర్లలో 11 విభాగాల షేర్లు లాభాలు గడించాయి. ప్రధానంలో బ్యాంకింగ్‌, ఆర్థిక సంస్థలు 1.49 శాతం నుంచి 1.55 శాతం మేర లభాలు చూశాయి.

అయితే, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా షేర్లు 0.62 శాతం , 0.27 శాతం మేర నష్టపోయాయి. కాగా ఆల్ట్రా టెక్‌ సిమెంట్‌ సంస్థ అతిపెద్ద లబ్దిదారుగా నిలిచింది. ఏకంగా 4.9 శాతం విలువ పెరగడంతో 28 శాతం మేర అమ్ముడుపోయాయి. గారిసిమ్‌, యూపీఎల్‌, హెడ్‌డిఎఫ్‌సి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు కూడా లాభాలు చూశాయి. ఇక బీఎస్‌సీలో ఆల్ట్రా టెక్‌ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, యాక్సిక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటాన్‌, కోటక్‌, మహింద్రా బ్యాంక్‌, హిందూస్తాన్‌ యూనీలీవర్‌, సన్‌ ఫార్మా, నెస్లే ఇండియా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎం అండ్‌ ఎం షేర్లు లాభాలు చూశాయి. ఇక ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) షేర్ల విలువ 0.20 శాతం మేర పెరిగింది. ఇన్ఫోసిస్‌, ఎన్టీపీసీ, పవర్‌ గ్రిడ్‌, విప్రో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ఏసియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు పతనమైనాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement