Monday, May 6, 2024

శ్రీశైలానికి వరద పోటు… నాగార్జునసాగర్‌కు జలకళ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుండడంతో నాగార్జునసాగర్‌ జలకళను సంతరించుకుంటోంది. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్‌ నిండడంతో వచ్చిన వరదను వచ్చినట్లుగానే అధికారులు నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం రెండు విద్యుత్‌ కేంద్రాల్లో జల విద్యుదుత్పత్తి కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 1, 20, 754 క్యూసెక్కుల వరద వస్తుండగా… పవర్‌ హౌజ్‌ లనుంచి 31, 784 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215. 807 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 195. 210 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. మరోవైపు నాగార్జునసాగర్‌ క్రమంగా జలకళను సంతరించుకుంటోంది. ఇటీవల వచ్చి చేరిన వరదకు సాగర్‌లో నీటి మట్టం 225.24 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 315 టీఎంసీలు. ఇక గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌కు క్రమంగా వరద తగ్గుముఖం పడుతోంది. సోమవారం 24, 720 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. దిగువన ఎల్లంపల్లి వద్ద 97, 276 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement