Thursday, May 16, 2024

శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వ‌ర‌ద‌..

శ్రీశైల జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటుంది. దీంతో నేటి సాయంత్రం గేట్లు ఎత్తి దిగువ సాగర్ కు నీటి విడుదల చేయనున్నట్లు జలమండలి శాఖ అధికారులు వెల్లడించారు. శ్రీశైల జలాశయం కు ప్రస్తుతం ఇన్ ప్లో 2,08,379 క్యూసెక్కులు,అవుట్ ప్లో 64,246 క్యూసెక్కులు. ఈ ఏడాది రెండోసారి డ్యాం గేట్లను తెరిచి నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు సిద్ధమ‌య్యారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 883.50 అడుగులు నీటి నిల్వ సామర్థ్యం 207.4103 టీఎంసీలుగా నమోదయింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తామని తెలిపిన జలవనరుల శాఖ అధికారులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement