Saturday, May 4, 2024

స్వర్ణ దేవాలయం సమీపంలో నేడూ పేలుళ్లు – ఐదుగురి అరెస్ట్

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం సమీపంలో గురువారం నాడు తెల్లవారుజామున పేలుళ్లు చోటు చేసుకున్నాయి . ఈ పేలుళ్లకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.స్వర్ణ దేవాలయం సమీపంలో వారం రోజుల వ్యవధిలో పేలుళ్లు చోటు చేసుకోవడం ఇది మూడోసారి.

గురువారంనాడు తెల్లవారుజామున 12:30 గంటల సమీపంలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి.ఈ పేలుడుకు కారణంగా భావిస్తున్న ఐదుగురిని పంజాబ్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించడమే లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడ్డారిన పోలీసులు చెప్పారు. పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలోని గదిలో నిందితులుగా అనుమానిస్తున్న ఐదుగురిలో ముగ్గురు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు పురుషులు. ఒకరు మహిళగా పోలీసులు పేర్కొన్నారు. పేలుడుకు పొటాషియం క్లోరేట్ ను ఉపయోగించారని పోలీసులు చెప్పారు

ఈ నెల 6, 8 తేదీల్లో స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ నెల 8వ తేదీ పేలుడు తర్వాత ఈ ఘటనపై ఎన్ఐఏ విచారణ నిర్వహిస్తుంది. ఈనెల 6వ తేదీన జరిగిన పేలుడులో ఒకరు గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.ఈ నెల 8వ తేదీన జరిగిన పేలుడులో మరో వ్యక్తి గాయపడ్డారు

Advertisement

తాజా వార్తలు

Advertisement