Thursday, May 2, 2024

టిల్లు స్వేర్ నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో.. ఫుల్ సాంగ్ అప్పుడే

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్‌ యాక్టర్‌ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు మంచి హిట్ కావ‌డంతో అదే జోష్ తో డీజే టిల్లు సీక్వెల్ తెర‌కెక్కిస్తున్నాడు. మల్లిక్‌రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. కాగా, ఈ మూవీ నుంచి తాజాగా ‘‘టికెటే కొనకుండా’’ అనే సాంగ్‌ ప్రోమోను లాంఛ్ చేశారు మేకర్స్‌. జులై 26న ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేయనున్న‌ట్టు ప్ర‌క‌టించారు మేకర్స్‌.

ఇక ఈ మూవీ సెప్టెంబర్ 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ బ్యానర్‌తో అసోసియేట్‌ అవుతూ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు రామ్‌ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి ఈ సారి టిల్లు 2లో టైటిల్‌కు తగ్గట్టుగా డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు రొమాన్స్‌ కూడా అదే రేంజ్‌లో ఉండబోతున్నట్టు తాజా ప్రోమోతో అర్థమవుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement