Sunday, June 2, 2024

Delhi: తొలిప్ర‌ధానికి సోనియాగాంధీ నివాళి

దేశ తొలిప్ర‌ధాని జ‌వ‌హ‌ర‌లాల్ నెహ్రు వ‌ర్ధంతి ఇవాళ‌. సోమ‌వారం ఉద‌యం ఢిల్లీలోని నెహ్రూ స్మారకమైన శాంతివన్‌లో పలువురు ప్ర‌ముఖులు చేరుకొని నివాళి అర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నివాళులు అర్పించారు. ఆయన సమాధిపై పుష్ప గుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు.

ఖర్గే, సోనియాగాంధీ ఒకేసారి శాంతివన్‌కు వెళ్లి నివాళులు అర్పించారు. అదేవిధంగా మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ కీలక నేత రాహుల్‌గాంధీ తమతమ అధికారిక ఎక్స్‌ ఖాతాల ద్వారా కూడా పండిట్‌ నెహ్రూకు నివాళులు తెలియజేశారు. నెహ్రూ ప్రస్తావన లేకుండా భారతదేశ చరిత్ర పూర్తికాదని అన్నారు. ఆధునిక భారత దేశ నిర్మాణానికి నెహ్రూ ఒక ఆర్కిటెక్ట్‌లా పనిచేశారని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement