Saturday, June 15, 2024

AP : గుండెపోటుతో…..మాజీమంత్రి సీతాదేవి మృతి

గుండెపోటుతో మాజీమంత్రి సీతాదేవి మృతి చెందారు. ఇవాళ ఉద‌యం ఆమె హైద‌రాబాద్‌లో త‌న తుదిశ్వాస‌ను విడిచారు.
సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్టీరామారావు మంత్రివర్గంలో యెర్నేని సీతాదేవి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆమె మృతిపట్ల రాజకీయ నేతలు సంతాపాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. సీతాదేవి పార్ధీవదేహాన్ని వారి స్వగ్రామం కైకలూరు నియోజకవర్గం, కలిదిండి మండలం, కొండూరు కు ఈరోజు సాయంత్రం తీసుకొని వస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

యెర్నేని సీతాదేవి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నదే. ఆమె భర్త నాగేంద్రనాథ్‌(చిట్టిబాబు) ఆంధ్రప్రదేశ్‌ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నార్‌ డెల్టా డ్రెయినేజీ బోర్డు సభ్యుడిగా పని చేశారు. కిందటి ఏడాదే ఆయన కన్నుమూశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నాగేంద్రనాథ్‌ సోదరుడు యెర్నేని రాజారామచందర్‌(దివంగత ) రెండు పర్యాయాలు కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement