Tuesday, October 8, 2024

AP: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్ర‌మాదంలో కానిస్టేబుల్ మృతి చెందారు. గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సునీల్ రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాడు. తెల్ల‌వారుజామున గుంటూరు ఇన్న‌ర్ రింగురోడ్డు స‌మీపంలో రోడ్డు పై ఉన్న స్పీడ్ బ్రేక్‌ను గ‌మ‌నించ‌క‌పోవ‌డంతో ప్ర‌మాదం వాటిల్లింది. తల‌కు తీవ్ర గాయ‌మై ర‌క్త‌స్ర‌వం జ‌ర‌గ‌డంతో అక్క‌డిక్క‌డే మృతి చెందాడు.

- Advertisement -

మృతదేహాన్ని పెద్దకాకాని పి.ఎస్ ఏ.ఎస్.ఐ ఆంటోనీ రాజ్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. తోటి కానిస్టేబుల్ చనిపోవడంతో ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement