Friday, May 3, 2024

మే 1న భారత్‌కు రానున్న స్పుత్నిక్ వీ వ్యాక్సిన్

రష్యా వ్యాక్సిన్ స్పుత్నిస్ వీ తొలి బ్యాచ్ మే 1న ఇండియాకు చేరనుంది. ఈ విషయాన్ని వ్యాక్సిన్ తయారీలో భాగమైన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) హెడ్ కిరిల్ దిమిత్రీవ్ వెల్లడించారు. ఎన్ని వ్యాక్సిన్లను ఎగుమతి చేయనున్నామన్న విషయాన్ని ప్రస్తావించలేదు. తొలి బ్యాచ్‌గా టీకాలను పంపుతున్నామని, ఆపై వరుసగా వయల్స్ వెళతాయని మాత్రమే స్పష్టం చేశారు. రష్యా నుంచి అందే టీకాలు కరోనాపై పోరులోభారత్ కు తోడ్పడతాయని అన్నారు. ఇండియాను ఆదుకునేందుకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు.

ప్రపంచవ్యాప్తంగా స్పుత్నిక్ వీని మార్కెటింగ్ చేస్తున్న ఆర్డీఐఎఫ్, ఇండియాలోని ఐదు కంపెనీలతో ఇప్పటికే టీకా తయారీ దిశగా డీల్స్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా డాక్టర్ రెడ్డీస్ సహా పలు కంపెనీలు, ఏడాదికి 85 కోట్ల స్పుత్నిక్ వీ డోసులను తయారు చేయనున్నాయి. మరో నెలరోజుల వ్యవధిలో 5 కోట్ల వరకూ స్పుత్నిక్ వీ డోసులు ఇండియాకు అందించాలని ఆర్డీఐఎఫ్ ఇప్పటికే నిర్ణయించింది. ఇవి దశలవారీగా ఇండియాకు చేరనున్నాయి. ఇక రష్యా ఫార్మా సంస్థ ఫార్మసీ ఎన్ టెజ్, ఇండియాకు 10 లక్షల ప్యాక్ ల రెమిడెసివిర్‌ను సరఫరా చేస్తామని, ఇందుకోసం రష్యా ప్రభుత్వాన్ని అనుమతి కోరామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement