Sunday, February 25, 2024

Fighter Jet Landing : బాపట్ల జాతీయ రహదారిపై దిగిన విమానాలు..

బాపట్ల : కొరిశపాడులోని పి.గుడిపాడు సమీపంలో జాతీయ రహదారిపై విమాన ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. జె.పంగులూరు మండలంలోని రేణింగివరం నుంచి కొరిశపాడు వరకు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఏపీలోని బాపట్ల జిల్లా రేణింగవరం-కొరిశపాడు మధ్య నాలుగు కిలోమీటర్ల రన్‌వేపై కార్గో, ఫైటర్‌ జెట్‌ విమానాలు ల్యాండింగ్‌ ట్రయల్‌ రన్‌ను విజయవంతం నిర్వహించారు. ట్రయల్‌ రన్‌ కారణంగా గురువారం ఉదయం 10.30 – 12 గంటల వరకు వాహనాలు మళ్లింపు చేపట్టారు. విప‌త్తు స‌మ‌యంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై విమానాలు దిగేందుకు వీలుగా రన్‌వేలు నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement