Thursday, April 25, 2024

ఘనంగా ముకేశ్ .. నీతా అంబానీల చిన్న కుమారుడు నిశ్చితార్థం వేడుక‌

ముకేశ్ అంబానీ..నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం రాధిక మ‌ర్చంట్ తో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. రాజస్థాన్‌లోని శ్రీనాథ్‌జీ ఆలయంలో వీరి వివాహం వేడుకను నిర్వహించారు.ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌’ సంస్థ సీఈఓ విరెన్‌ మర్చంట్‌-శైలజా మర్చంట్‌ల కుమార్తెనే రాధిక. మర్చంట్‌ కుటుంబానికి, అంబానీ కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలున్నాయి. ఇదే అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల మధ్య ప్రేమకు దారితీసింది. అంబానీ ఇంట జరిగే ప్రతి కార్యక్రమంలోనూ రాధిక పాల్గొంటూ అందరి దృష్టినీ ఆకర్షించేవారు.

ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరు చివరకు వివాహ బంధంతో ఒక్కటికాబోతున్నారు.రాధిక.. న్యూయార్క్‌ యూనివర్సిటీలో పాలిటిక్స్‌, ఎకనమిక్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసింది. రాధికకు శాస్త్రీయ నృత్యం అంటే చిన్న వయసు నుంచే ఇష్టం. ఈ మక్కువతోనే ప్రముఖ డ్యాన్సర్‌ భావనా థాకర్‌ వద్ద భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకున్న రాధికకు.. కాబోయే అత్తమామలు ముకేశ్‌-నీతాలు జియో వరల్డ్‌ సెంటర్‌ ఘనంగా ‘అరంగేట్రం’ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి అంబానీ, మర్చంట్‌ కుటుంబాలతో పాటు.. దేశవ్యాప్తంగా పలు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement