Saturday, May 18, 2024

అక్టోబర్‌ 11 నుంచి ఫిఫా వరల్డ్‌ కప్‌.. మ‌హారాష్ట్ర వేదిక‌గా 32 మ్యాచులు

ఫిఫా అండర్‌-17 మహిళల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌-2022 విడుదలైంది. అక్టోబర్‌ 11 నుంచి టోర్నమెంట్‌ ప్రారంభం కానుంది. ఫిఫా వరల్డ్‌ కప్‌ టోర్నీకి ఈసారి కూడా భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్‌ 30 వరకు సాగనున్న ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. ఒడిశా, గోవా, మహారాష్ట్ర వేదికలుగా మొత్తం 32 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్‌ దశలో 24 మ్యాచ్‌లు… అక్టోబర్‌ 11 నుంచి 18 వరకు జరుగనున్నాయి.

అక్టోబర్‌ 21, 22 తేదీల్లో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు, అక్టోబర్‌ 26న గోవా వేదిక సెమీస్‌ మ్యాచ్‌లు, 30న నవీ ముంబై వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. గ్రూప్‌ దశలో భారత్‌ జట్టు భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో అక్టోబర్‌ 11, 14, 17 తేదీల్లో మూడు మ్యాచ్‌లు ఆడనుండనుంది. ఈ మేరకు ఫిఫా వరల్డ్‌ కప్‌ టోర్నీ నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement