Monday, April 29, 2024

చుట్టలో బాంబు పెట్టిన తప్పించుకున్నాడు..

“నీ మిత్రులెవరో తెలిస్తే నీ వ్యక్తిత్వం తెలుస్తుంది. నీ శత్రువులెవరో తెలిస్తే నీ సామర్ధ్యం అర్థమవుతుంది” ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. క్యూబా విప్లవ యోధుడు, తలవంచిని వారుడు ఫిడెల్ క్యాస్ట్రో. అవును ఫిడెల్ క్యాస్ట్రో ప్రపంచానికి అమెరికాను ఎలా ఎదిరించాలో చేసి చూపించాడు. కేవలం 90 మైళ్ళ దూరంలో వున్న అమెరికాతో 57 ఏళ్ళపాటు రాజీలేని పోరాటం చేశాడు. నేడ ఫిడెల్ క్యాస్ట్రో జన్మదినం.

1926 ఆగస్టు 13న జన్మించిన ఫిడెల్ అలెగ్జాండ్రో క్యాస్ట్రో రుజ్ 1953లో క్యూబా నిరంకుశపాలకుడైన బటిస్టా ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు. జైలు పాలై క్షమాభిక్షతో 1956లో విడుదలై తిరిగి విప్లవ ప్రయత్నాలు చేశారు. 1959లో చేగువేరా సాహచర్యంతో విప్లవ విజేతగా నిలిచారు. 1976 వరకు క్యూబా ప్రధానిగా, తర్వాత 2006 వరకు క్యూబా అధ్యక్షునిగా 47 ఏళ్ళపాటు అనేక ఒడిదుడుకులు, ఒత్తిళ్ళ నడుమ దేశాభివృద్ధికి కృషిచేశాడు.
నిరక్షరాస్యత నిర్మూలనలో, వైద్యసౌకర్యాల అభివృద్ధిలో, చెరుకు ఉత్పత్తిలో ప్రపంచ గుర్తింపు వచ్చే విధంగా కృషిచేశారు.

సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఫిడెల్ క్యాస్ట్రోను 638 సార్లు (అమెరికా గూఢచారి సంస్థ) క్యాస్ట్రో పై హత్యాయత్నాలు చేసింది. కాని ఒక్క సారి కూడా అతన్ని ఏమి చేయలేకపోయింది. ఇతడు కాల్చే చుట్టలో బాంబు పెట్టి, స్కూడా-డైవింగ్ షూట్ లో ప్రాణాంతకమైన ఫంగస్ ను ఉంచటం వంటి అనేక ప్రయత్నాలు చేసినప్పటకి అతన్న ఏమి చేయలేకపోయింది అమెరికా. ఖరికి అతని మాజీ ప్రియురాలు మారటా లోరెంజ ద్వారా కూడా ఇతనిని హత్యచేయుటకు సి.ఐ.ఏ ప్రయత్నించింది. కానీ ప్రతీ సారీ కాస్ట్రో మృత్యుంజయుడై బయటపడి అమెరికాకు పక్కలో బల్లెమై ఎదురు నిలిచాడు.

క్యూబాను ఆర్ధికంగా, రాజకీయంగా విచ్ఛిన్నం చేయాలనే కుట్రలను తిప్పికొడుతూ, ప్రపంచ పీడిత ప్రజల నేస్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక దేశభక్తికీ చెక్కుచెదరని సామ్యవాద ఆదర్శానికి నమూనాగా ఫిడెల్ క్యాస్ట్రో నిలిచాడు. బటిస్టా న్యాయస్థానంలో, “చరిత్ర నన్ను నిర్దోషిగా నిలుపుతుంద” ని క్యాస్ట్రో చేసిన వీరోచిత ఉపన్యాసంలో వ్యక్తంచేసిన విధంగా పోరాడుతున్న ప్రజానీకంలోనూ, వారి అంతిమ విజయంలోనూ ఆయనయొక్క అంతులేని నమ్మకం-క్యూబాలోనూ, లాటిన్ అమెరికాలోనూ, కరేబియన్ దీవుల నుండి ఆఫ్రికా, ఆసియా దేశాల వరకు, అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నింటా పోరాడే యువతలో స్ఫూర్తిని రగిల్చాడు ఫిడల్ క్యాస్ట్రో.

ఇది కూడా చదవండి: కేంద్రం ఏది చెప్తే ట్విట్టర్ అదే చేస్తోంది: రాహుల్ గాంధీ

Advertisement

తాజా వార్తలు

Advertisement