Saturday, March 25, 2023

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్దరు తాపీ మేస్త్రీలు మృతి

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు తాపీ మేస్త్రీలు మృతి చెందిన ఘ‌ట‌న ఏలూరు జిల్లా లింగ‌పాలెం మండ‌లంలో చోటుచేసుకుంది. మండలంలోని పుప్పాలగూడెం వద్ద ట్రాక్టర్‌ ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతులు ఖ‌మ్మం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement