Thursday, May 2, 2024

క్రమబద్దీకరణ గడువు పొడగింపు.. ఎవ‌రికి వ‌ర్తిస్తుందంటే?

ప్రభన్యూస్, ప్రతినిధి, యాదాద్రి : ప్రభుత్వ ఉత్తర్వులు నెం.58, 59 ద్వారా అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు దరకాస్తులు సమర్పించుటకు ఈ నెల 31 వ వరకు గడువు పొడగించినట్లు క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తి తెలిపారు. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను అంద‌జేయాల‌న్నారు. 2014 జూన్ 02 కటాఫ్ తేదీ ఉండగా, దానిని 2020 జూన్ 02 కు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెల 17వ తేదీ వ‌ర‌కు ఉత్తర్వుల సంఖ్య 29ను జారీచేసింది, నూతనంగా దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

కాగా, 2020 జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ స్థలాలో నివాస గృహములు, నివాసేతర కట్టడాలు నిర్మించుకున్న వారు క్రమబద్దికరణకు దరఖాస్తు చేసుకోవడానికి క‌లెక్ట‌ర్ తెలిపారు. అందుకు సంబంధిత డాక్యుమెంటరీ ఆధారాలతో మీ సేవా కేంద్రాల ద్వారా ఈ నెల (మే) 31 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement