Friday, May 3, 2024

Exclusive – మ‌ట్టివాస‌న‌తో గ‌ట్టి హిట్ కొట్టిన సినిమాలు…

పల్లెల్లో కనిపించే , అనుబం ధాలు, సహజవాతావరణం పట్ట ణాల్లో కనిపించదని అంటారు. దాదాపుగా అందరి నేపథ్యం పల్లె లే.
నేటితరం ఆధునికతలో పడిపో యి పల్లెను మరిచింది. కానీ పల్లె నేపథ్యంలో తీసిన సినిమాలను మాత్రం యువత ఆదరిస్తోంది.
గతంలో తెలుగు సినిమాలు ఎక్కువగా మన ప్రాంతాల్లోనే చిత్రీకరించేవారు. పాటల కోసం కొత్తగా ఉంటుందని భావించి విదేశాలకు వెళ్లేవారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. పాటలు మాత్రమే కాదు సినిమా మొత్తం విదేశాల్లోనే తీస్తున్నారు. దీనికి వారు చెబుతున్న కారణం రిచ్‌నెస్‌. పట్టణం, విదేశీ నేపథ్యం బోరు కొట్టినట్టు అనిపిస్తోం ది. దాంతో యూ టర్న్‌ తీసుకుని మళ్లిd గ్రామీణ కథలకు తెరరూపం ఇస్తున్నారు.
పైగా ఇలా తీసిన గ్రామీణ నేప థ్యం కథా చిత్రాలు విజయం సాధిం చడం జరుగుతున్నాయి. అందుకే దర్శకనిర్మాతలు పల్లెబాట పడుతు న్నారు. కొన్నాళ్ల క్రితం వచ్చిన రంగ స్థలం, సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు తదితర చిత్రాలు అలా వచ్చి విజయం సాధించినవే. ప్రతీకా ర గాథలు, కుటు-ంబ అనుబంధా లు… ఇలా ఈ ఏడాది ఒక్కో అంశం తో ఒక్కో చిత్రం పల్లెటూరి నేపథ్యం లో తెరకెక్కి హిట్‌ అందుకున్నాయి. ఇంకొన్ని రాబోతున్నాయి. ఆ సినిమాలేంటో తెలుసుకుందాం.

మహేశ్‌ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తోన్న ‘గుంటూరు కారం’ సినిమా పల్లెతో ముడిపడి ఉన్నట్లు-గా తెలుస్తోంది. జూ.ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు శివ కొరటాల తెరకెక్కిస్తున్న ‘దేవర’. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది. 1980 కాలంలో గోదావరి జిల్లాలో జరిగే ఓ అందమైన కథ రంగస్థలం. ఈ సినిమాను రాజమండ్రి పరిసర ప్రాంతా ల్లో దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిం చారు. గతంలో పల్లె నేప థ్యం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల జాబితా చాలా ఉంది. వీటి గురించి వివరంగా తెలుసుందాం. రామ్‌ చరణ్‌, సమంత హీరో హీరోయిన్లుగా నటించా రు. ఈ సినిమా సుమారు రెండు వందల కోట్లు వసూలు చేసింది. నాగార్జున నటించిన విజయవంతమైన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన చిత్రాన్ని పల్లెటూరు నేపథ్యంలో చిత్రీకరించారు. 1500 ఏళ్ళ క్రితం నటి విష్ణు ఆలయం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వరి చేలు, కొబ్బరి తోటలు.. చేపల చెరువులు ఇలా శతమానం భవతి సినిమాలో కోనసీమ అందాలని దర్శకుడు, రచయిత సతీష్‌ వేగేశ్న శతమానంభవతి చిత్రంలో గ్రామీణ ప్రాంతాన్ని బాగా చూపించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటుగా జాతీయ అవార్డులు సైతం గెలుచుకుంది.
ఇక చిన్న సినిమాగా విడుదలై, ఊహించనంత పెద్ద విజయం అందుకున్న చిత్రం ‘బలగం’. తెలంగాణలోని ఓ మారుమూల పల్లెలో జరిగే ఈ కథ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. కుటు-ంబ బంధాలే ప్రధానంగా రూపొందిన ఈ కథ. ఎంతోమందిలో మార్పు తీసుకొచ్చింది.

నాని నటించిన దసరా సినిమా కూడా గ్రామీణ కథతో తీసిందే. గోదావరిఖనిలో సింగరేణి సమీపంలోని వీర్లపల్లి అనే ప్రాంతం చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కిన చిత్రం.. దసరా. వీర్లపల్లిలో రాజకీయం, మద్యపాన నిషేధం, ప్రతినాయకుడు హీరోయిన్‌పై మోజు పడడం, విలన్‌ పై హీరో ప్రతీకారం తీర్చుకోవడం ఈ సినిమాలో కనిపిస్తాయి.

సాయిధరమ్‌ తేజ్‌ నటించగా, వంద కోట్లకు పైగా వసూళ్లతో దూసు కెళ్లింది ‘విరూపాక్ష’ . తాంత్రిక శక్తుల కాన్సెప్ట్‌తో రుద్రవనం అనే ఊరి నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిం ది. క్షుద్ర పూజలతో తమ చిన్నారుల్ని బలిస్తున్నారనే ఆరోపణలతో రుద్రవనం గ్రామస్థులు దంపతులను సజీవ దహనం చేయడం, మంటల్లో కాలుతూ ప్రాణం విడుస్తూ ఆ జంట ఊరిని శపించడం, వారి నోటి నుంచి ఏ మా-టైతే వచ్చిందో 12 ఏళ్ల తర్వాత అది రుజువవడం, దాని వెనక ఉన్న గుట్టు-ను హీరో రట్టు- చేయడం.. ఇదీ ఈ సినిమా సారాంశం.
ఎన్టీఆర్‌, వంశీ పైడిపల్లి కలయి కలో రూపుదిద్దుకున్న బృందావ నం కూడా గ్రామీణ వాతావర ణాన్ని కళ్ళకు కట్టింది. మహేష్‌ బాబు నటించిన శ్రీమంతుడు సైతం పల్లె నేపథ్యం చిత్రమే. కొరటాల శివ ఈ సినిమాని తమిళనాడు పొల్లాచిలో ఎక్కువ భాగం తీశారు. అక్కడి ఊరి సెట్‌.. మామిడి తోట.. ప్రతి ఒక్కరికి తమ సొంతూరిని గుర్తుకు తెచ్చింది.

- Advertisement -

మహేష్‌, వెంకటేష్‌ హీరోలుగా గోదావరి జిల్లాల్లో రూపుదిద్దుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు-. అక్కడి అందాలని, అనుబంధాల్ని గుర్తుకుతెస్తుంది. తెలుగు వారి ఆత్మీయతను, అనురాగాలను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారు.
త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ‘అ ఆ’ సినిమాలో పశ్చిమ గోదావరి జిల్లాలోని కలవ పూడి అందాలను చక్కగా చూపించారు. సినిమాల లొకేషన్స్‌, కథల కోసం ఇం గ్లిష్‌ సినిమాలను చూడాల్సిన అవసరం లేదని, మన చుట్టూ ఉన్న ప్రాంతాలను, వ్యక్తులను గమనిస్తే సరిపోతుందని కృష్ణవంశీ చంద మామ సినిమాతో చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే పల్లెటూ రి నేపథ్యంలో సినిమాలు చాలానే వచ్చాయి,వస్తునాయి కూ డా.

ఈ చిత్రాలు మాత్రమే కాకుం డా చాలా వరకు చిన్న సినిమాలు పల్లె నేపథ్యంలోనే రూపొందిస్తు న్నారు. తెలంగాణ పల్లెకథలతో విరాటపర్వం, నేను లోకల్‌, పరేషా న్‌, జాతిరత్నాలు, మేము ఫేమస్‌, భీమదేవరపల్లె బ్రాంచ్‌ వంటి అనేక చిత్రాలు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement