Monday, April 29, 2024

FIFA Women’s WC | ఫుట్ బాల్ టోర్నీలో సంచల‌నం.. ఫ్రాన్స్ పై ఆసీస్ ఘ‌న విజ‌యం

ఫిఫా మ‌హిళ‌ల‌ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆతిథ్య జ‌ట్టు ఆస్ట్రేలియా సంచ‌ల‌నం సృష్టించింది. ఫ్రాన్స్‌తో జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్లో విజ‌యం సాధించి తొలిసారి సెమీఫైన‌ల్లో అడుగుపెట్టింది. నిర్ణీత స‌మ‌యంలోపు రెండు జ‌ట్ల‌లో ఎవ్వ‌రూ ఒక్క గోల్ కూడా చేయ‌క‌పోవ‌డంతో.. విజేత‌ను నిర్ణ‌యించేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వ‌హించారు. ఈ పెనాల్టీ షూటౌట్‌లో యువ ఫుట్‌బాల‌ర్ విక్కీ బెచో గోల్ కొట్ట‌డంతో 7-6తో గెలిచిన ఆస్ట్రేలియా జ‌ట్టు సెమీస్ లో త‌మ‌ బెర్తు ఖాయం చేసుకుంది.

ఇక దీంతో రెండేళ్ల క్రితం ఫైన‌ల్ లో ఆడిన ఫ్రాన్స్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. మ‌రోవైపు, ఇంగ్లండ్, కంబోడియా జ‌ట్ల మ‌ధ్యఆగ‌స్టు 16న‌ రెండో సెమీస్ ఫైట్ జ‌రుగ‌నుంది. ఇప్ప‌టికే సెమీఫైన‌ల్లో అడుగుపెట్టిన‌ స్పెయిన్, స్వీడ‌న్ ఆగ‌స్టు 15వ తేదీన ఫైన‌ల్ బెర్తు కోసం త‌ల‌ప‌డ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement