Monday, April 29, 2024

బ్లూటిక్ పై మినాహాయింపులు.. ప్రముఖులకు తిరిగి వచ్చిన వెరిఫికేషన్ బ్యాడ్జ్

సినీ, రాజకీయ ప్రముఖులకు మళ్లీ ట్విటర్ బ్లూ టిక్ వచ్చేసింది. ఇటీవల చాలామంది మంత్లీ సంబ్స్ర్కిప్షన్ కట్టకపోవడంతో వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోల్పోయిన క్రమంలో ట్విటర్ యజమాని ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్లూటిక్‌ను ఇచ్చే విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు స్పష్టం అవుతుంది.

కనీసం 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల ఖాతాలకు బ్లూటిక్‌ను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది ప్రముఖులకు ఇవ్వాల (ఆదివారం) వెరిఫికేషన్ బ్యాడ్జ్ బ్లూటిక్ తిరిగి వచ్చినట్టు కనిపించింది. మరికొందరి అకౌంట్లలో టిక్‌పై క్లిక్ చేస్తే డబ్బులు ఇచ్చి తీసుకున్నట్లు కనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement