Monday, December 9, 2024

Big Breaking: రెచ్చిపోయిన ఆసీస్​ బ్యాట్స్​మన్​.. టీమిండియాపై సునాయస విజయం

టీమిండియాతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఆసిస్​ సత్తా చాటింది. బ్యాటింగ్​ విభాగంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. టార్గెట్​ని ఛేదించారు. ఆసీస్​ ముందు ఇండియా 208 పరుగుల బిగ్​ స్కోర్​ టార్గెట్​గా పెట్టినా సునాయసంగానే గెలిచారు. అయితే.. తొలి 5 ఓవర్లలో ఆసీస్​ బ్యాట్స్​మన్ రెచ్చిపోయి ​ భారీగానే స్కోరు సాధించారు. ఈ క్రమంలో ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్​ చేసి సక్సెస్​ జోడీకి బ్రేక్​ ఇచ్చారు. ఇట్లా పది ఓవర్లు ముగిసే సరికి వారి ఆటలు సాగకుండా బౌలర్లు పైచేసి సాధించారు..

కాగా, ఆరాన్​ ఫించ్​ (22), కేమరాన్​ గ్రీన్​ (61), స్టీవ్​ స్మిత్​ (35)ను అవుట్​ చేశారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్​మన్​ కూడా పెద్దగా రాణించలేదు. అయినా చివరలో వచ్చిన వారు బెటర్​గా ఆడి జట్టును గెలిపించారు.​ దీంతో నిర్ణీత ఓవర్లలో ఆసిస్ ఆరు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి గెలుపొందింది, కాగా, అక్షర్​ పటేల్​ 3, ఉమేశ్​ యాదవ్​ 2 వికెట్లు తీసి భారత్​ సత్తా చాటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement