Tuesday, March 21, 2023

21 నుంచి ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం! ఆన్‌లైన్‌ మూల్యాంకనం లేనట్టే?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 21 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. 21వ తేదీ నుంచి సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనున్నారు. ఆతర్వాత ఇతర పేపర్లను మూల్యాంకనం చేయనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఆన్‌లైన్‌లో ఇంటర్‌ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలని భావించిన ఇంటర్‌ బోర్డు ఈమేరకు దానికి కోసం టెండర్లను కూడా ఆహ్వానించిన విషయం తెలిసిందే.

- Advertisement -
   

అయితే రెండు సంస్థలు మాత్రమే టెండర్లు వేయడంతో ఆన్‌లైన్‌ మూల్యాంకనం ప్రక్రియ ఇంకా ఖరారు కానట్లుగా తెలుస్తోంది. మార్చిలో రాసే పరీక్షలకు ఆన్‌లైన్‌ మూల్యాంకనం నిర్వహించకుండా అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలకు ఆన్‌లైన్‌ మూల్యాంకనం నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement