Wednesday, May 1, 2024

నా కెరీర్ లోనే ఏనుగు బిగ్గెస్ట్ చిత్రం – హీరో అరుణ్ విజయ్

త‌న కెరీర్ లోనే ఏనుగు చిత్రం బిగ్గెస్ట్ చిత్రం అవుతుంద‌ని హీరో అరుణ్ విజ‌య్ అన్నారు.ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ న‌టిస్తోంది.ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో రాధిక శరత్ కుమార్, సముద్రఖని, యోగి బాబు, కేజీఎఫ్ రామచంద్రరాజు తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘సింగం’ సిరీస్ సినిమాలను తెరకెక్కించిన హరి దర్శకత్వం వహించారు. సీహెచ్ సతీశ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో ఘనంగా జరిగింది. ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతోందని తెలిపారు. ఈ చిత్రం కమర్షియల్, ఎమోషనల్ యాక్షన్ మూవీ అని చెప్పారు. ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసేలా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారని… ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement