Tuesday, April 16, 2024

IND vs ENG | భార‌త్ బౌల‌ర్ల‌కు త‌లొంచిన ఇంగ్లండ్.. జైత్రయాత్ర‌ను కొన‌సాగిస్తున్న టీమిండియా

ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) లక్నో వేదికగా ఇంగ్లండ్ తో జ‌రిగిన‌ పోరులో టీమిండియా బౌల‌ర్లు చెలరేగారు. త‌క్కువ స్కోర్ తోనే చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్క‌లు చూపించారు. ఇంగ్లండ్ జ‌ట్టును 129 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసి మ‌రో విజ‌యం త‌మ ఖాతాలో వేసుకోగా… ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ ల్లోనూ గెలిచి అన్ బీట‌బుల్ గా దూసుకుపోతుంది టీమిండియా.

ఇక, మ్యాచ్ ఆరంభ ఓవర్లలోనే బుమ్రా, షమీలు ఇంగ్లండ్‌ టాపార్డర్‌ను దెబ్బతీయగా కుల్దీప్‌ యాదవ్‌.. ఇంగ్లీష్‌ జట్టు సారథి జోస్‌ బట్లర్‌ (23 బంతుల్లో 10) ను ఔట్‌ చేసి ఆ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. ఇక ఆ త‌రువాత వరుస పెట్టి ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌ను పెవిలియ‌న్ పంపారు భార‌త బౌల‌ర్లు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ భారత్‌ను విజయానికి చేరువ చేశారు. ఇక ఇందులో ష‌మీ 4 , బుమ్రా 3 , కుల్దీప్ 2 , జ‌డేజా 1, ద‌క్కించుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement