Monday, April 29, 2024

ట్విట్టర్‌ డీల్‌ నుంచి తప్పుకున్న ఎలాన్‌ మాస్క్‌.. న్యాయపోరాటం చేస్తామన్న ట్విట్టర్‌

టె స్లా అధినేత ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నకిలీ ఖాతాల వివరాలు ఇవ్వలేదని, విలీన ఒప్పందంలోని పలు నిబంధనలను ట్విట్టర్‌ ఉల్లంఘించిందని , దీంతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. ట్విట్టర్‌ కొనుగోలుకు ఎలాన్‌ మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లతో ఒప్పందం చేసుకున్నారు. కంపెనీ తన నివేదికలో చెప్పినట్లుగా 5 శాతం కంటే తక్కువ స్పామ్‌ ఖాతాలున్నట్లు ఆధారాలు చూపించే వరకు డీల్‌ ముందుకు వెళ్లదని ఆయన కొంత కాలంగా చెబుతున్నారు. ట్విట్టర్‌ చెప్పిన దాని కంటే ఎక్కువగానే స్పామ్‌ ఖాతాలు ఉండే అవకాశం ఉందిని పలు మార్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విలీన ఒప్పందాన్ని అమలు చేయడానికి బోర్డు చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు ఆలోచిస్తోందని ట్విట్టర్‌ బోర్డు చైర్మన్‌ బ్రెట్‌ టెయిల్‌లో తెలిపారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్లడమా, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలా అన్న విషయాన్ని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మస్క్‌తో కుదిరిన ఒప్పందాన్ని చట్ట ప్రకారం రద్దు చేసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఒప్పందం ప్రకారం డీల్‌ను పూర్తి చేయలేకపోతే ఎలాన్‌ మస్క్‌ బ్రేక్‌ ఆప్‌ ఫీజుగా 1 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

2022 జనవరిలో ట్విట్టర్‌ లో ఎలాన్‌ మస్క్‌ షేర్లను..

కొనుగోలు చేయడం ప్రారంభించారు. మార్చి నాటికి కంపెనీలో మస్క్‌ షేర్ల విలువ 5 శాతానికి పెరిగింది. ఏప్రిల్‌ నాటికి ట్విట్టర్‌లో ఆయన వాటా 9.2 శాతానికి పెరడంతో అతి పెద్ద వ్యక్తిగత వాటాదారుడిగా నిలిచారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 14న ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. ఒక్కో షేరుకు 54.20 డాలర్ల చొప్పున మొత్తం 44 బిలియన్‌ డాలర్ల ఒప్పందానికి ఆఫర్‌ ఇచ్చారు. ఏప్పిల్‌ 25న ట్విట్టర్‌ బోర్డు మస్క్‌ కొనుగోలు ఆఫర్‌ను అంగీకరించింది. ట్విట్టర్‌లో నకిలీ ఖాతాలు ఉన్నాయని ప్రకటించిన మస్క్‌ వీటి విషయం తేలే వరకు ఒప్పందం ముందుకు వెళ్లదని ప్రకటించారు. దీంతో మే 15న 5 శాతం కంటే తక్కవగానే స్పామ్‌ ఖాతాలు ఉన్నాయని ట్విట్టర్‌ నివేదిక ఇచ్చింది. దీనిపై మస్క్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. పూర్తి ఆధారాలు ఇవ్వాలని కోరారు. జూన్‌ 16న ఇదే విషయంపై ట్విట్టర్‌ ఉద్యోగులతో ఆయన వర్చువల్‌గా సమావేశమయ్యారు. నకిలీ ఖాతాల విషయంలో ఇచ్చిన వివేదికలో డేటా సరిగాలేదని అనుమానం వ్యక్తం చేశారు. చివరకు ఇదే అంశంపై కొనుగోలు నుంచి తప్పుకుంటున్నట్లు మస్క్‌ ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement