Friday, May 3, 2024

నువ్వూ.. నేనూ తేల్చుకుందామా.. ఉక్రెయిన్‌ యుద్ధంపై పుతిన్‌కు ఎలాన్‌మస్క్‌ సవాల్‌

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ఛాలెంజ్‌ విసిరారు. నువ్వూ.. నేనూ.. పరస్పరం పోరాడుకుందాం.. ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం అంటూ సోమవారం సంచలన ట్వీట్‌చేశారు. ఉక్రెయిన్‌పై ఎడతెగని దాడులు కొనసాగిస్తూ విధ్వంసం, మారణహోమానికి కారణమవుతున్న తీరుపై మండిపడ్డారు. దమ్ముంటే ఒకరినొకరం ప్రత్యక్షంగా తేల్చుకుందాం రా అంటూ సవాల్‌ చేశారు. నేను వ్లాదిమిర్‌ పుతిన్‌ను ఒంటరి పోరాటానికి సవాల్‌ చేస్తున్నాను. గెలిచిన వారు ఉక్రెయిన్‌లో వాటా పొందుతారు అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌లో పుతిన్‌ పేరును రష్యన్‌ భాషలో రాసుకొచ్చిన ఎలాన్‌మస్క్‌, అందులో రష్యా అధ్యక్షుడు అధికారిక ట్విట్టర్‌ ఖాతాను ట్యాగ్‌ చేశారు. పుతిన్‌కు ట్విట్టర్‌ ఖాతా లేనందున క్రెవ్లిున్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతాను ట్యాగ్‌ చేసి మరీ.. వెంటనే స్పందించాలంటూ ఠారెత్తించారు.

ఈ ట్వీట్‌ చేసిన గంట తర్వాత మరొక ట్వీట్‌ చేశారు. ఈ ఛాలెంజ్‌ను మీరు స్వీకరిస్తున్నారా? అంటూ క్రెవ్లిుంగ్‌ను ప్రశ్నించారు. కాగా టెస్లా అధినేత ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ట్వీట్‌ చేసిన గంటల వ్యవధిలోనే 80వేల లైక్స్‌ వచ్చాయి. 17వేల రీట్వీట్స్‌ వచ్చాయి. 6వేలకు పైగా రిప్లయ్‌లు వెల్లువెత్తాయి. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలవగానే తన స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను ఎలాన్‌మస్క్‌ అందించారు. ఆ తర్వాత జెలెన్‌స్కీ ప్రభుత్వానికి, ఉక్రెయిన్‌ పౌరులకు సంపూర్ణ మద్దతు తెలిపారు. అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌కు రష్యా బెదిరింపులనూ తిప్పికొట్టారు. మాస్కో సేవలు నిలిపివేస్తే సహాయం చేసేందుకు తన సంస్థ సిద్ధంగా ఉందంటూ ప్రపంచానికి భరోసా ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement