Tuesday, April 30, 2024

మస్కా.. మజాకా: ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు, అడిగిన వెంటనే స్పందించిన టెక్‌ దిగ్గజం

యుద్ధపీడిత ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాలనుంచి సాంత్వన లభిస్తోంది. రష్యా దాడులతో దేశంలోని, ప్రధానంగా రాజధీని కీవ్‌లో ఇంటర్నెట్‌ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పౌరులు, అధికార యంత్రాగం, చివరకు సైన్యం కూడా దీనివల్ల తీవ్ర అసౌకర్యానికి గురైంది. సమాచార వ్యవస్థ దాదాపు స్తంభించిపోయింది. ఈ దశలో ఉక్రెయిన్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ శాఖ మంత్రి మైఖేలో ఫెడరోవ్‌ అప్రమత్తమయ్యారు. అమెరికాకు చెందిన టెక్‌ దిగ్గజం సహాయన్ని కోరారు. మార్స్‌లో మానవ ఆవాసాలను నిర్మించాలని మీరు తపనపడుతూంటే రష్యా మా దేశాన్ని ఆక్రమించాలని చూస్తోంది… మీరు రూపొందించిన రాకెట్లు అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకుపోతూంటే రష్యా రాకెట్లను మా పౌరులపైకి ఎక్కుపెడుతోంది…

ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీ స్టార్‌లింక్‌ సేవలు మాకు అందించాలి… అని ట్విట్టర్‌లో కోరారు. ట్వీట్‌ చేసిన పది గంటల్లో స్పేస్‌ ఎక్స్‌ సారథి స్పందించారు. ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని, మరిన్ని సేవలు అందిస్తామని ట్విట్టర్లో ప్రకటించారు. స్టార్‌లింక్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తోంది. అందుకోసం దాదాపు 2వేల శాటిలైట్లను ప్రయోగించి పనిచేయిస్తోంది. శుక్రవారంనాడు మరో 50 ఉపగ్రహాలను భూకక్ష్యలోకి పంపింది. పనిలో పనిగా రష్యా పౌరులు ఉక్రెయిన్‌కు అనుకూలంగా వ్యవహిరంచాలని, పుతిన్‌ విస్తరణ కాంక్షను వ్యతిరేకించాలని ఎలన్‌ మస్క్‌ పిలుపునివ్వడం విశేషం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement