Thursday, April 25, 2024

ఐపీఎల్‌లో నేడు ఎలిమినేటర్ పోరు.. బెంగళూరు వర్సెస్ కోల్‌కతా

ఐపీఎల్‌లో ఈరోజు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న బెంగళూరు, నాలుగో స్థానంలో ఉన్న కోల్ కతా మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. మరోవైపు క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. ఈరోజు జరుగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచే జట్టు ఫైనల్ బెర్త్ కోసం ఢిల్లీతో తలపడనుంది.

షార్జా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్పు నెగ్గని బెంగళూరు జట్టు టైటిల్ లక్ష్యంగా ఆడనుంది. చాలా రోజుల నుంచి ఊరించుకుంటున్న వస్తున్న ఐపీఎల్ టైటిల్‌ను ఈసారైనా దక్కించుకోవాలని చూస్తోంది. మరో వైపు ఇప్పటికే ఐపీఎల్ టైటిల్ నెగ్గిన నైట్ రైడర్స్ మరోమారు కప్పు కొట్టాలనే ఆలోచనలో ఉంది. దీంతో ఈరెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement