Thursday, May 2, 2024

సోలార్‌ పవర్‌తో ఎలక్ట్రిక్‌ హైవేలు, ట్రక్కులు, బస్సులకు చార్జింగ్ చేయొచ్చు

దేశంలో సోలార్‌ పవర్‌తో ఎలక్ట్రిక్‌ హైవేలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. హైవేలపై విద్యుత్‌ ట్రక్కులు, బస్సులకు ఛార్జింగ్‌ ఏర్పాటు చేస్తారు. ీ రైల్వే విద్యుత్‌ లైన్ల మాదిరిగానే హై వేలపై లైన్లను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా నడుస్త్ను వాహనాలు ఛార్జీంగ్‌ చేస్తారు. సోమవారం నాడు జరిగిన ఇండో-అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(ఐఏసీసీ) సమావేశంలో మాట్లాడుతూ నితిన్‌ గడ్కరీ ఈ విషయం చెప్పారు. ఎలక్ట్రిసిటీతో నడిచే ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం సోలార్‌, పవన విద్యుత్‌ ఆధారిత ఛార్జింగ్‌ మెకానిజాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందన్నారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ హైవేలను అభివృద్ధి చేసే అంశంపై పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీని ద్వారా రోడ్లపై వెళ్లే ట్రక్కులు, బస్సులు సోలార్‌ ఎనర్జీని ఉపయోగించుకుంటాయని చెప్పారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల్లోనూ సోలార్‌ ఎనర్జీని వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలోఓ 26 గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. పీఎం గతి శక్తికి స్కీమ్‌ కింద వీటిని నిర్మిస్తున్నామని, వీటి వల్ల రవాణా ఖర్చులు చాలా వరకు తగ్గుతాయని చెప్పారు.

హైవేలను సాధ్యమైనంత ఎక్కువ ఉపయోగించుకునేందుకు వీలుగా వీటిని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు. మౌళిక సదుపాయాలు పెరిగితే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, కొత్త మవ్యాపారాలు అభివృద్ధి జరుగుతుందని, ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు.

రైల్వే లైన్ల మాదిరిగానే…

ఎలక్ట్రిక్‌ హైవేలు రైల్వేలైన్ల మాదిరిగానే పని చేస్తాయి. విద్యుత్‌ తీగల సాయంతో రైళ్లు నడుస్తున్నట్లుగానే ఈ హైవేలపై కూడా సోలార్‌ విద్యుత్‌ తీగలను ఏర్పాటు చేస్తారు. ఈ జాతీయ రహదారిపై నడిచే ట్రక్కులు, బస్సులు వీటి సహాయంతో నడుస్తున్న సమయంలోనే ఛార్జింగ్‌ అవుతాయి. ప్రధానమైన కారిడార్‌లో ఏ రూట్‌లో ఎలక్ట్రిక్‌ హైవేలను అభివృద్ధి చేయాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement