Sunday, April 28, 2024

Election Schedule – ఎపి, తెలంగాణ‌లో మే 13న పోలింగ్.. జూన్ 4న ఫ‌లితాలు

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ నేడు విడుద‌ల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) లోక్‌సభతో పాటు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ను ప్రకటించింది… ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌, కొత్త కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సంధూలతో కూడిన పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల తేదీలను రాజీవ్ కుమార్ వెల్ల‌డించారు.

దేశ వ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు
దేశ వ్యాప్తంగా 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు. 543 లోక్ సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఏపీలో అసెంబ్లీకి, లోక్ స‌భ కు మే 13న ఎన్నికలు నిర్వ‌హించ‌నున్నారు.. .. అలాగే తెలంగాణాలో 17 లోక్ స‌భ స్థానాల‌కు మే 13న పోలింగ్ జ‌ర‌గ‌నుంది . జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇక ఎపి, తెలంగాణ‌లో ఏప్రిల్ 18 నుంచి నామినేష‌న్స్ స్వీక‌రిస్తారు.. 26నుంచి నామినేష‌న్స్ ఉప‌సంహ‌ర‌ణ ఉంటుంది.మే 13న పోలింగ్ నిర్వ‌హించి, జూన్ 4న ఎన్నిక‌ల ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు.. అలాగే హైద‌రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి కూడా ఉప ఎన్నిక మే13న నిర్వ‌హించ‌నున్నారు..

కాగా, | ప్రపంచవ్యాప్తంగా 2024లో ఎన్నికలు జరుగుతున్నాయని.. ఈ సంవత్సరాన్ని ఎన్నికల సంవత్సరంగా చెప్పుకోవచ్చని కేంద్ర ఎన్నికల కమిషనర్ అన్నారు. .. ప్రపంచమంతా భారత ఎన్నికల వైపు చూస్తోందన్నారు. స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం నెలకొన్న భారతదేశం ఎలా చేస్తుందని ప్రపంచం గమనిస్తుందన్నారు. ప్రతి ఎన్నిక ఎన్నికల సంఘానికి పరీక్షేనన్నారు. ప్రతి పరీక్షలో విజయం సాధించాలన్నదే ఈసీ లక్ష్యమని, దేశమంతా పర్యటించి ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించామన్నారు.

ప్రతి అంచెలోనూ విశ్వాసం ఉన్నదని.. దేశపౌరులంతా వినియోగించుకోవాలని ఈజీ విజ్ఞప్తి చేశారు. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో ఎన్నికల సౌకర్యాల కల్పన పెద్ద సవాల్‌ అన్నారు. దేశవ్యాప్తంగా 97కోట్ల మంది ఓట్లు వేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో 55లక్షల లక్షల ఈవీఎంలు వినియోగిస్తామని.. సార్వత్రిక ఎన్నికల్లో 1.5 కోట్ల మంది సిబ్బంది పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో 4లక్షల వాహనాల వినియోగమని.. 10.5లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎలాంటి లోపం లేకుండా ఎన్నికలు జరగాలన్నదే ఈసీ ప్రయత్నమన్నారు.

దేశవ్యాప్తంగా 96.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్నారు. దేశవ్యాప్తంగా పురుషులు 49.7 కోట్ల మంది ఓటర్లు.. మహిళా ఓటర్లు 47.1 మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. తొలిసారిగా ఓటుహక్కును 1.80కోట్ల మంది ఓటర్లు వినియోగించుకోనున్నారన్నారు. 20-29సంవత్సరాల 19.47కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్నారు. దేశవ్యాప్తంగా 48వేల మంది ట్రాన్స్‌జెండ్‌ ఓటర్లు, దేశవ్యాప్తంగా 88.4 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారని చెప్పారు. ప్రతి వెయ్యి మంది పురుషులకు 948 మంది మహిళా ఓటర్లు ఉన్నారని.. 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారన్నారు. ఎన్నికల్లో స్త్రీలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అన్నారు. 17వ లోక్‌సభ పదవీకాలం జూన్‌ 16వ తేదీతో ముగియనున్నదని వివరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement