Saturday, April 27, 2024

Election’s First Phase – ముగిసిన నామినేష‌న్ల ప‌ర్వం

102 లోక్‌స‌భ‌లో స్థానాల‌కు ఎన్నిక‌లు
త‌మిళ‌నాడులోని 39 స్థానాల‌కు
ఏప్రిల్ 19న పోలింగ్
ఇప్ప‌టికే హోరెత్తుతున్న ప్ర‌చారం

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏడు దశల్లో జరగనుంది. మొదటి దశలో 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధ‌వారంతో ముగిసింది . అయితే.. బీహార్‌లో మాత్రం నామినేషన్ల గడువు గురువారం వ‌ర‌కు ఉండ‌నుంది.

తమిళనాడులో 39 స్థానాల‌కు పోలింగ్

తమిళనాడులోని మొత్తం 39 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొదటి దశలోనే పోలింగ్ జరగనుంది. రాజస్థాన్‌లో 12 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, ఉత్తరాఖండ్‌లో 5, అస్సాంలో 5, మహారాష్ట్రల్లో5 లోక్‌సభ స్థానాల్లో బుధ‌వారంతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో మూడు, అరుణాచల్ ప్రదేశ్‌లో 2, మణిపూర్‌లో 2, మేఘాలయలో 2, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి తొలి దశలో పోలింగ్ జరగనుంది. ఇక‌.. బీహార్ మినహా మిగిలిన ప్రాంతాల్లో రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30 చివరి తేదీ. ఏప్రిల్ 19న 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.

కూట‌ములు.. అగ్రనేతల ప్రచారం

మొదటి దశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల్లో ఎన్డీఏ, ఇండియా కూటములు త‌మ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్‌ షా, నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్డీఏ తరపున పోటీచేస్తున్న అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ ఇండియా కూటమి తరపున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement