Thursday, May 16, 2024

కర్ణాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం

కర్ణాటక అసెంబ్లీ 2023 ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొన్ని రోజులుగా మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నుంచి ముఖ్య నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరోవైపు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నంలో భాగంగా ర్యాలీలు, రోడ్ షోలు కూడా నిర్వహించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పార్టీల మధ్య సవాళ్లకు ప్రతి సవాళ్ల విసురుకుంటూ పలువురు నేతలు విమర్శలకు దిగారు. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా 113 అసెంబ్లీ స్థానాలు గెలవాలి. ఇక మొత్తం 224 సీట్లలో 36 సీట్లు ఎస్సీ, 15 ఎస్టీ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో మే 10న కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కోసం ఓటింగ్ జరుగనుంది. అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి అని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మే 13న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, జీడీఎస్ పార్టీలు కీలకం కానున్నాయి. ఎన్నికలను ప్రశాంతంగా జరపడానికి ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 58282 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసింది. అయితే ఈ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా 5 .2 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఇందులో మొదటిసారి ఓటును వేస్తున్నవారు 9 .17 లక్షల మంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement