Monday, May 20, 2024

ఈటెల బీజేపీ నేత కాదు.. టీఆర్ఎస్ నాయకుడే.. ఫ్లెక్సీ వైరల్

హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు ఇంకా ఈటెల రాజేందర్‌ను మరిచిపోలేకపోతున్నారు. ఎందుకంటే ఈటెల బీజేపీలో చేరి రెండు నెలలు గడుస్తున్నా.. ఇంకా తమ పార్టీలోనే ఉన్నట్లు పలువురు నేతలు భ్రమపడుతున్నారు. దీనికి తాజా నిదర్శనం జాతీయ చేనేత దినోత్సవం రోజు హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలు తయారుచేయించిన ఓ ఫ్లెక్సీ.

వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల అధ్యక్షురాలు ఎం.స్వర్ణలత, ఆమె భర్త రాజనర్సింగరావు శనివారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఓ ఫ్లెక్సీ తయారుచేయించారు. సదరు ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో పాటు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, బోయిన్‌పల్లి వినోద్ కుమార్, ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా ఉన్నారు. విచిత్రం ఏంటంటే హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ తమ అభ్యర్థిగా ఈటెల రాజేందర్‌ను ప్రచారం చేసుకుంటుంటే.. మరోవైపు టీఆర్ఎస్ నేతలు మాత్రం ఈటెల తమ నాయకుడే అన్నట్లు ఫ్లెక్సీలు ముద్రించడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వార్త కూడా చదవండి: నేతన్నకు భరోసా… త్వరలో చేనేతలకు బీమా

Advertisement

తాజా వార్తలు

Advertisement