Sunday, May 5, 2024

Editorial – భార‌త్ కు జ‌ల‌గండం….

మనదేశంలో మరో రెండేళ్ళలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడవచ్చని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. భూగ ర్భ జలమట్టం అడుగంటిపోయి ఈ పరిస్థితి ఏర్పడుతుం దని అంచనా వేసింది. నీటి కొరత నిత్యం మనం అనుభ విస్తున్నదే. ఎటు చూసినా మంచినీరున్నా దప్పిక తీర్చ డానికి గుక్కెడు దొరకని గ్రామాలు, పట్టణాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. పవిత్రమైన గంగ, గోదావరి, కృష్ణ వంటి జీవనదులు ఉన్నప్పటికీ ఆ నీరంతా ప్రజల దాహాన్ని తీర్చలేకపోతోంది. ఈ విషయమై ఎన్నో గోష్టు ల్లో, ఎంతో మంది నిపుణులు స్పష్టం చేశారు. సమయం వచ్చినప్పుడల్లా గణాంకాలతో సహా చేస్తూనే ఉన్నారు. ఎన్నో నీటి వనరులను మన దేశం కలిగి ఉన్నప్పటికీ మంచినీటి వనరుల్లో మన దేశం నాలుగు శాతాన్ని మాత్రమే కలిగి ఉంది. మన దేశంలో నీటివృధా ఎక్కువ. నదులను పవిత్రమైనవి అని అంటూనే, వాటికి పూజలు చేసి హారతులు ఇస్తూనే, వాటిని అపరిశుభ్రంగా తయారు చేస్తున్నారు మన వాళ్ళు. నిజానికి మన దేశంలో జీవ నదులే కాదు, వాగులు, చెరువులు, చెలమలు ఇంకా ఎన్నో నీటి వనరులు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం చేతకాకపోవడం వల్లనే నీటి కొరత ఏర్పడు తోంది.

నీటి కొరతకు రుతుపవనాలు ఆలస్యమయ్యాయ నే కారణం చెబుతూ ఉంటారు. కానీ, రుతుపవనాలు ఆలస్యం కావడం అనేది ఒక కారణమే తప్ప అదే ప్రధాన మైనది కాదు. నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో నిల్వ చేసుకునేందుకు మన దేశంలో తగినన్ని జలాశయాలు లేవు. ఉన్న వాటి లో నాసిరకంగా నిర్మాణమైనవే ఎక్కువ. మన దేశంలో మౌలిక సదుపాయాలు అంతంతమాత్రం గా ఉండటం వల్ల కూడా పుష్కలంగా ఉన్న ప్రాంతాల నుంచి ఎద్దడి ప్రాంతాలకు నీటిని తరలించే సౌకర్యాలు లేవు. అతివృష్టి వల్ల లభ్యమైన నీటిని నిల్వచేసుకునే సౌకర్యాలు లేకపోవడంతో నదుల్లో నీరంతా సముద్రం లోకి వృధాగా పోతోంది. అవసరమైన చోట్ల ఆనకట్టలు, జలాశయాలను నిర్మించడానికి బదులు రాజకీయ ఒత్తిళ్ళకు లోనై ప్రభుత్వాలు ఆనకట్టలకు శంకుస్థాపనలు చేస్తున్నాయి. నీటిని నిల్వచేసే జలాశయాల నిర్మాణంపై ప్రభుత్వాలు తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు. జలాశయాల నిర్మాణంలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు జలాశయా ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసి వదిలేస్తున్నారు తప్ప, వాటిని నిర్ణీత సమయంలో పూర్తి చేయడం లేదు. పైగా, జలాశయాల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడం వల్ల అవి లీకేజీలకు గురి అవుతున్నా యి. సరైన నిర్వహణ లేకపోవడంవల్ల కొన్ని చోట్ల మంచి నీటి పైపుల నుంచి నీరు వృధాగా పోతోంది. అలాంటి దృశ్యాలను చూసినా సంబంధిత అధికారుల దృష్టికి తేక పోవడం పౌరుల్లో స్పష్టంగా కనిపిస్తున్న నిర్లిప్తత. నీటిని పొదుపుగా వాడుకోవాలన్న ఇంగితాన్ని ప్రజలకు తెలియజేయడంలో విఫలమవుతున్నాయి. కాలువలు, చెరువుల గట్ల వద్ద పారిశుధ్యాన్ని కాపాడటంలో పంచా యతీలు, మునిసిపాలిటీలు,నగరపాలక సంస్థలు విఫలమవుతున్నాయి. పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించలేకపోతున్నాయి.

వర్షాలు బాగా పడుతున్న ప్పటికీ భూగర్భ జలాల మట్టాలు పెరగడం లేదు. ఇందు కు కారణం భవన నిర్మాణ అవసరాల కోసం భూగర్భ జలాలను ఎక్కువ వినియోగించు కుంటున్నారు. పట్టణా ల్లో, నగరాల్లో వంద అడుగులు ఇంకా ఎక్కువ లోతున తవ్వితే తప్ప నీరు పడటం లేదు. నీటి కొరతకుగల ప్రధాన కారణాల్లో మానవ తప్పిదాలు లేదా మనుషుల ప్రమేయమే ఎక్కువగా ఉంటున్నాయి. అంతేకాకుండా నీటిని పొరుగువారికి లభించేట్టు చూడాల్సిన అవసరా న్ని ఏ ఒక్కరూ గుర్తించకపోవడం, స్వార్థ చింతన పెరిగి పోవడం కూడా నీటి కొరతకు కారణాల్లో ఒకటి. వాతావ రణ మార్పుల కారణంగా మనదేశం 2060 నాటికి తీవ్రమైన నీటిని కొరతను ఎదుర్కొంటుందని నిపుణులు అంచనా వేశారు. భూతాపం, కార్బన్‌ ఉద్గారాల విడుదల కారణంగా గాలిలో తేమ తక్కువైపోతోంది. నీటి వినియోగంపై ప్రజలకు సదవగాహన కల్పించడం చాలా అవసరం. అది లేనిదే ఎన్ని నిర్మాణాలు చేసినా ప్రయోజ నం ఉండదు.

- Advertisement -

నీటిని పొదుపుగా వాడుకోవడమే కాకుం డా, నీటి అవసరాల గురించి పొరుగు వారికి వివరిస్తూ ఉంటారు. చెరువులను కబ్జా చేయడం వల్ల కూడా నీటి కొరత ఏర్పడటమే కాకుండా, వరదల సమయంలో వరద నీరు పోయే మార్గం లేక, అనేక ఇళ్ళు, భవనాలు నీటిలో తేలియాడుతున్నాయి. ఐటి రాజధానిగా పేరొందిన బెంగళూరులో, కాస్మాపాలి టన్‌ నగరంగా వృద్ధి చెందిన చెన్నైలో నీటి కొరత ఎక్కువ గా ఉంటోంది. హైదరాబాద్‌లో కూడా గతంలో పరిస్థితి అలాగే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో తీసుకున్న చర్యల వల్ల నీటి కొరత తీవ్రత చాలా వరకూ తగ్గింది. ప్ర జల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు తగిన చర్యలు సకాలంలో తీసుకుంటే నీటి కొరత నివా రణ సాధ్యమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement