Friday, February 23, 2024

Sangareddy: 7కిలోల బంగారం పట్టివేత

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో వందల కోట్ల సొత్తు పట్టుబడింది. ఈ తనిఖీల్లో నగదుతో పాటు బంగారం, మద్యం, వెండి, గంజాయి, డ్రగ్స్ పట్టుబడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.

తాజాగా సంగారెడ్డి జిల్లా చిరాగ్ పల్లి అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసు తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. తెలంగాణ-కర్ణాటక బార్డర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తెల్లవారుజామున వాహన తనిఖీలు చేపడుతుండగా… స్కార్పియోలో తరలిస్తున్న ఏడు కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు బిస్కెట్లు,ఆభరణాల రూపంలో బంగారం తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నమన్నారు.బంగారానికి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి ఎన్నికల అధికారులకు అప్పగించనున్నట్లు చిరాగ్ పల్లి ఎస్సై నరేష్ తెలిపారు. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement