Monday, July 15, 2024

ఎడిటోరియ‌ల్ – రాహుల్ పై వేటు … అంత తొంద‌రా?

కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీని అనర్హుని గా ప్రకటిస్తారన్న ఊహాగానాలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. కానీ, ఇంత అత్యవసరంగా వేటు వేస్తారని ఎవరూ అనుకోలేదు.రాహుల్‌పై పరువు నష్టం కేసు నాల్గేళ్లక్రితం నాటిది. ఇప్పుడే ఆయనపై అంత తొందరగా వేటువేయాల్సిన అవసరమేమొచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మన దేశంలో కోర్టులు, చట్టాలు ఇంత త్వరగా స్పందిస్తున్నాయా సంభ్రమాశ్చ ర్యాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌ని దుమ్మెత్తి పోసే పార్టీలు కూడా రాహుల్‌పై వేటును వ్యతిరేకిస్తున్నాయి. ఇది చీకటి రోజు, రాహుల్‌పై చర్యతో ప్రజాస్వామ్యం మరింత పతనమైందని వ్యాఖ్యానిస్తున్నాయి. దొంగలం దరిదీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకుంటుందో అని రాహుల్‌ 2019లో కర్నాటకలోని కోలార్‌లో చేసిన వ్యాఖ్యపై గుజరాత్‌ బీజేపీ శాసనసభ్యుడు పూర్ణేష్‌ మోడీ సూరత్‌ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు నాల్గేళ్ళ పాటు నడిచింది. గురువారం నాడు సూరత్‌ కోర్టు రాహుల్‌కి రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. ఆగ మేఘాలపై లోక్‌సభ సచివాలయం రాహుల్‌ని అనర్హుని గా ప్రకటించింది. న్యాయ ప్రక్రియను ఎవరూ ఆక్షేపించ డం లేదు. పైగా మన దేశంలో న్యాయప్రక్రియ ఇంత వేగంగా జరుగుతుందా అని కొందరు ఆశ్చర్యపోతున్నా రు. కానీ, సూరత్‌ కోర్టు తీర్పు వెలువడిన వెంటనే లోక్‌ సభ సచివాలయం రాహుల్‌ని అనర్హునిగా ప్రకటించడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. పైకోర్టుకు అప్పీలు చేసుకోవడానికి సూరత్‌ కోర్టు 30 రోజుల వ్యవధి ఇచ్చిం ది. సాధారణంగా ఇలాంటి కేసులన్నింటిలోనూ ఇలాం టి నియమాన్నే పాటిస్తారు. కానీ,రాహుల్‌పై కోర్టు తీర్పు వెలువడిన 24 గంటల వ్యవధిలోనే వేటు పడటంపై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రాహుల్‌పై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్న మాట నిజమే. అది పూర్తిగా రాజకీయపరమైనది. అలాగే, రాహుల్‌ చేసిన, చేస్తున్న విమర్శలు కూడా రాజకీయ పరమైనవే.

మన దేశంలో రాజకీయనాయకులు ఇలాంటి విమర్శలు చేసు కోవడం మామూలే. అంతవరకూ ఎందుకు ప్రధాన మంత్రి మోడీయే ప్రస్తుత పార్లమెంట ు తొలివిడత సమా వేశాల్లో నెహ్రూ పేరును ఉపయోగించుకోవడానికి గాంధీ కుటుంబీకులు ఎందుకు అవమానంగా భావిస్తు న్నారంటూ ప్రశ్నించారు. అలాగే, యూపీఏ హయాం లో కేంద్రంలో, రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలన్నింటికీ గాంధీ పేరేపెట్టారనీ, ఒక్కదానికి కూడానెహ్రూు పేరు పెట్టలేదని ఎద్దేవా చేశారు.అదే రీతిలో రాహుల్‌గాంధీ నీర బ్‌ మోడీ వ్యవహారంపై మాట్లాడుతూ దొంగలంద రిదీ మోడీ అని ఇంటి పేరు ఎందుకు ఉంటుందోనని వ్యాఖ్యానించారు. నెహ్రూ పేరును ఇదే మాదిరిగా గడిచి న ఆరున్నర దశాబ్దాలుగా ప్రతిపక్షాలు ఎద్దేవా చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

గాంధీ పేరును హీనప ర్చందుకు బ్రాందీ షాపులకు పేరు పెట్టుకున్నారన్న విమర్శలు వచ్చాయి, రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధార ణం అయిపోయాయి. ఏదో పాసింగ్‌ రిమార్క్‌ గా రాహు ల్‌ మోడీ ఇంటి పే రును ఉపయోగించి ఉండవచ్చు.అంత మాత్రాన ఆయన మోడీని విమర్శించినట్టు కాదు. పైగా రాహుల్‌ గాంధీ ప్రధాని మోడీని దృష్టిలో పెట్టుకుని ఆ వ్యాఖ్యలు చేశారు. కాని మోడీ కేసు వేయలేదు. ఇక్కడే ఈకేసు తీవ్రతని అర్థం చేసుకోవచ్చు. నీరబ్‌ మోడీ వ్యవ హారంలోనే కాకుండా ఆయనకు ముందు స్వదేశీ బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసి అక్కడ ఆస్తులు కూడబెట్టినట్టు విజయ్‌ మాల్యపై ఈ వారంలోనే ఆరోపణలు వచ్చాయి.

భారత్‌లో తీసుకున్న బ్యాంకు రుణాలను తీర్చగలిగిన స్థోమతు ఉన్నప్పటికీ తీర్చకుం డా విదేశాలకు పరారై అక్కడ ఆస్తులను సంపాదించా రనీ, అలాగే, మెహుల్‌ చోక్సీ పేరును ఇంటర్‌పోల్‌ జాబితా నుంచి తొలగించారనీ, దేశంలోని రేవులన్నింటి నీ అదానీకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపణలు వచ్చాయి. రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణ లన్నీ సర్వసాధారణం. ఒక్కొక్క దానిపై కోర్టుకేసులు నడిపించి శిక్షలు పడేట్టు చేస్తే భారత దేశంలో ని కోర్టుల న్నింటిలో కేసుల సంఖ్య ఇంకా పెరిగిపోతుంది. ఇప్పటికే లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల ప్రకటించారు. రాజకీ యంగా విమర్శలను రాజకీయంగానే ఎదుర్కోవాలి.

- Advertisement -

రాహుల్‌గాంధీ వ్యక్తిగత జీవితంపై బీజేపీ నాయకులు ఎన్నో ఆరోపణలు చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. అన్నిం టికీ పరువునష్టం దావాలు వేసుకుంటూ పోతే కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. అయినప్పటికీ దిగువ కోర్టులు ఇచ్చే తీర్పులపై అప్పీలు చేసుకునే అవకాశం ప్రజాస్వా మ్యం మనకు కల్పించింది. ఆ హక్కును రాహుల్‌ని విని యోగించుకోనివ్వకుండా లోకసభ సచివాలయం తొంద రపడిందేమోనన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది. రాహుల్‌పై వేటును బీజేపీ యేతర పార్టీలన్నీ తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఎవరూ సహించబోరని స్పష్టం చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement