Monday, March 20, 2023

ఎడిటోరియ‌ల్ – అరుణాచ‌ల్ పై అమెరికా అండ‌..

భారత్‌,చౖౖెనాల సరిహద్దుగా మెక్‌మహాన్‌ రేఖను గుర్తిస్తూ అమెరికా సెనేట్‌ ఆమోదించిన తీర్మానంతో అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌ అంతర్భాగమన్న విషయం మరోసారి స్పష్టమైంది.చైనా అరుణాచల్‌ప్రదేశ్‌ని తమ దేశంలో కలుపుకునేందుకు తాజాగా ప్రయత్నాలు చేసింది.ఇంకా చేస్తోంది. చైనా విదేశాంగ మంత్రి,ఆ శాఖ ప్రతినిధి సమయం వచ్చినప్పుడల్లా అరుణాచల్‌ ప్రస్తావనచేస్తూ ఉంటారు. దశంలో అంతర్గత అశాంతిని ఎదుర్కోవడానికి పాక్‌ పాలకులు కాశ్మీర్‌ సమస్యను తరచూ లేవనెత్తుతున్నట్టే, చైనా పాలకులు అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ దేనంటూ ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఇవి కవ్వింపు ప్రకటనలుగా కనిపించినప్పటికీ, రాజకీ యంగా తమ పబ్బం గడుపుకోవడానికి అరుణాచల్‌ ప్రస్తావన చేయడం అనివార్యంగా వారు భావిస్తూ ఉంటారు.అమెరికా సెనేట్‌లో సభ్యుడు బిల్‌ హెగర్టీ ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెడుతూ శర వేగంగా అభివృద్దిచెందుతున్న భారత్‌తో అమెరికా భుజంకలిపి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, ముఖ్యంగా, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భారత్‌ వంటి నమ్మకమైన దేశాన్ని అక్కున చేర్చుకుని ముందుకు సాగా ల్సిన తరుణం ఇదని ఆయన అన్నారు. భారత్‌కు అమెరికన్‌ సెనేట్‌లో ఈ మాదిరి సాయం లభించడం ఇది మొదటి సారి కాదు. గతంలో ఒబామా అమెరికా అధ్యక్షునిగా ఉన్నప్పుడు డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన సభ్యుడు ఒకరు ఇదే మాదిరిగా భారత్‌కి అండగా నిలవాల్సిన అవసరం గురించి నొక్కి వక్కాణించారు. చైనా గుర్రు అదే. అంతేకాకుండా చైనాకి వ్యతిరేకంగా జపాన్‌, ఆస్ట్రేలియా, తదితర దేశాలతో ఏర్పాటు చేసిన క్వాడ్‌లో భారత్‌ చేరడం,క్వాడ్‌ దేశాలతో విన్యాసాల్లో పాల్గొనడం పట్ల కూడా చైనా కంటగింపుగా ఉంది.

ఈ విషయాన్ని దాచుకోకుండా పలుసార్లు విమర్శించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి చైనీస్‌ సైనికులు చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించడం, వారిని భారత సైనికులు తరిమి కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగు తుండటాన్ని బిల్‌ హెగర్టీ ప్రస్తావించారు.చైనా దూకుడు కు కళ్ళెం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సెనేట్‌లో హెగర్టీ గొంతెత్తి చాటారు. హెగర్టీ ప్రకటనతో భారత్‌కి నైతిక మద్దతు లభించింది.చైనా పట్ల అమెరికన్‌ సెనెెట్‌లో వ్యతిరేకులు ఇంకా ఉన్నారు. భారత్‌కూ, టిబెట్‌కూ మధ్య ఈ సరిహద్దును హెన్రీ మెక్‌మహన్‌ 1914లో జరిగిన సివ్లూ సమావేశంలో ప్రతిపాదించగా, చైనా మొదటి నుంచి దీనిని వ్యతిరేకిస్తోంది.ఈ రేఖ పశ్చిమాన భూటాన్‌ నుంచి 890 కిలో మీటర్లు, తూర్పు న బ్రహ్మపుత్ర మలుపు నుంచి 260 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉంది.మన దేశం కూడా మొదట్లో దీనిని వ్యతిరేకించింది.బ్రిటిష్‌ పాలనలో 1935లో ఒలాఫ్‌ కారో అనే బ్రిటిష్‌ అధికారి ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని ఒప్పించారు.ఆ తర్వాత అధికారికంగా మ్యాప్‌లు ముద్రించారుమెక్‌ మెహన్‌ను భారత్‌ అధికారిక సరిహద్దుగా గుర్తించగా,చైనా గుర్తించలేదు.అప్పటి నుంచి పేచీ పెడుతున్నది.1964లో చైనా దురాక్రమణకు కారణం అదే. టిబెట్‌కి సార్వభౌమత్వం లేదనీ, ఇలాంటి ఒప్పందాలను కుదుర్చుకునే హక్కు టిబెట్‌కి లేదని చైనా వాదిస్తోంది.మొదట్లో అమెరికా ఈ అంశంపై తటస్థంగా వ్యవహరిస్తూ వచ్చింది.చైనా దురాక్రమ ణలు పెరగడంతో భారత్‌లో అమెరికా రాయబారి గాల్‌బ్రెత్‌ ఆనాటి అమెరికన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.అప్పట్లో అమెరికా భారత్‌ని సమర్ధిస్తూ వచ్చింది. ఈ విషయంలో అమెరికా భారత్‌ని సమర్ధిం చడంతో ,పాకిస్తాన్‌ని చైనా సమర్ధిస్తోంది సరిహద్దు సమస్యపై భారత్‌,చైనాల మధ్య తగాదాలను అమెరికా కొంత కాలం తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించింది.

భారత్‌ ఎప్పుడూ ఒకే వైఖరిని అనుసరిస్తోంది.సరిహద్దు సమస్యపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఇప్పటికీ చైనాతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు.అయితే, చైనా మాట మీద నిలబడకపోవడంతో సంప్రదింపులు ముందుకు సాగడం లేదని జైశంకర్‌ అన్నారు. అంతేకాకుండా చైనా పాకిస్తాన్‌ని సమర్ధిస్తున్న తీరు చూస్తే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు.కాశ్మీర్‌ విభజన విషయంలో చైనాకు సంబంధం ఏ మాత్రం లేకపో యినా, చైనా పాకిస్తాన్‌ని కవ్విస్తూ మన దేశంలోకి సేనలను పంపేందుకు ప్రయత్నిస్తోంది.
భారత్‌ని ఇబ్బంది పెట్టేందుకు చైనా, పాకిస్తాన్‌లు ఏకమవుతు న్నాయి. ఈ కారణంగా రెండ ు పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు భారత్‌ సంయమనంతో, సహనంతో వ్యవహరి స్తోంది. అయితే, అమెరికాకు ఇప్పుడు భారత్‌ మద్దతు కావాలి. అందువల్ల ఇలా మాట్లాడుతోందన్న వాదన కూడా ఉంది.దానిని తోసిపుచ్చలేం. ఏమైనా అమెరికా మన పక్షాన నిలిచినందుకు సంతోషించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement