Thursday, April 25, 2024

అన్న‌పూర్ణ ఫోటో స్టూడియో…..

పెళ్లి చూపులు, డియర్‌ కామ్రేడ్‌, దొరసాని వంటి సినిమాలతో అభిరు చిని చాటు-కున్న బిగ్‌ బెన్‌ సినిమాస్‌ బ్యానర్‌ లో వస్తో న్న మరో చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ . ”ఇచ్చ ట అందమైన ఫోటోలు తీయబడును” అనేది ఉప శీర్షిక. 30వెడ్స్‌ 21 ఫేమ్‌ చైతన్య రావు హీరోగా, లావణ్య హీరోయిన్‌గా నటి స్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ నిర్మాత డి. సురేష్‌ బాబు చేతుల మీదు గా విడుదల చేశారు. ఈ సందర్భగా సురేష్‌ బాబు మాట్లాడుతూ ”అన్నపూర్ణ ఫోటో స్టూడియో పేరుతో వస్తోన్న ఈ సినిమా బృందానికి శుభాకాంక్షలు చెబు తున్నాను. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటు-న్నాను” అన్నారు.
దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ ” యష్‌ రంగినేని గారు నా కథ నచ్చి ఈ అవకాశం ఇచ్చారు. అంతా కొత్త టీ-మ్‌ తో పనిచేశాం. ఈ చిత్రం 1980 ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ. దీంతో పాటు- కొన్ని ట్విస్ట్‌ లు, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయి. సహజమైన నేటివిటీ-తో ఉండటం వల్ల చాలామందికి వారి పాత జ్ఞాపకాలను గుర్తుకు చేస్తుంది. గతంలో నేను చేసిన ఓ పిట్టకథ చిత్రం నాకు మంచి పేరు తెచ్చింది. ఈ చిత్రం అంతకు మించిన పేరును తెస్తుందని ఆశిస్తున్నాను.”అన్నారు.

హీరోయిన్‌ లావణ్య మాట్లాడుతూ ”కం-టె-ంట్‌ పరంగా కథ ప్రధానంగా ఏడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. మంచి లవ్‌ స్టోరీతో పాటు- ఫన్‌, సస్పెన్స్‌, థ్రిల్‌ తో పాటు- మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ తో చూసిన ప్రతి ఒక్కరికీ మంచి ఫీల్‌ ను ఇస్తుందని చెప్పగలను” అన్నారు. హీరో చైతన్యరావు మాట్లాడుతూ ”అందమైన సినిమా మా అన్నపూర్ణ ఫోటో స్టూడియో.” అన్నారు.
నిర్మాత యష్‌ రంగినేని మాట్లాడుతూ ”ఇది ఓ కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమా. అం దరూ కొత్తవాళ్లే. ఈ సినిమాకు ప్రధాన బలం కథ. ఓ పిట్టకథ చిత్రంతో మెప్పించిన చెందు ముద్దు ఈ కథను బాగా రాసుకున్నారు. ఫన్‌ తో పాటు- -కై-మ్‌, థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌ కూడా బాగా కుదిరాయి.” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement