Monday, April 15, 2024

Earthquake : ఢిల్లీ, హర్యానాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదు

దేశ రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ, హ‌ర్యానాలో అంద‌రూ నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లో మునిగి తేలుతున్నారు. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలంతా రోడ్లపైకి పరుగులు తీశారు. ఢిల్లీలో భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.19 గంటలకు ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 3.8గా నమోదయిందని వెల్లడించింది. భూకంప కేంద్రం హర్యానాలోని ఝజ్జర్‌లో ఉన్నదని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement