Sunday, April 28, 2024

Earthquake : చైనా, జపాన్‌లలో భూకంపం…

చైనా, జపాన్‌లలో గురువారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. వాయువ్య చైనాలోని కింగ్‌హై ప్రావిన్స్‌లోని మంగ్యా నగరంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్టు వెల్లడించింది.

మరోవైపు జపాన్‌లో హోన్షు తూర్పు తీరంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. దీని భూకంప కేంద్రం 32కిలోమీటర్ల లోతుతో నమోదైనట్టు పేర్కొంది. అయితే ఈ రెండు భూకంపాలకు సంబంధించిన ప్రాణనష్టం, ఆస్తి నష్టం వివరాలను అధికారులు వెల్లడించలేదు.

- Advertisement -

చైనా పొరుగున ఉన్న తైవాన్‌లో బుధవారం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అనంతరం అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే చైనా, జపాన్‌లలో ప్రకంపనలు రావడంతో ఆందోళనలు నెలకొన్నాయి. తైవాన్‌లో ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించగా..1000 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తోంది.100కు పైగా భవనాలు, పలు రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. 50 మందికి పైగా గల్లంతుకాగా..అందులో ఇద్దరు భారతీయులు సైతం ఉన్నారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement