Thursday, April 25, 2024

Dubai : గోల్డెన్ వీసా అందుకున్న.. తొలి టాలీవుడ్ హీరో అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి అరుదైన గౌర‌వం ద‌క్కింది. దుబాయ్ ప్రభుత్వం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి బన్నీకి గోల్డెన్ వీసా (Gloden Visa) అందింది. టాలీవుడ్ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి హీరోగానూ అల్లు అర్జున్ గుర్తింపు దక్కించుకున్నారు. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా దుబాయ్ లోని ఓ అధికారితో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు. గా దుబాయ్ సిటీ వ్యూ ఫొటోను కూడా షేర్ చేసి ఆసక్తికరంగా కామెంట్ చేశారు. ‘మరోసారి అద్భుతమైన అనుభూతిని కలిగించిన దుబాయ్ కి ధన్యవాదాలు. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు థ్యాంక్యూ. త్వరలో మళ్లీ దుబాయ్ లో కలుసుకుందాం’ అని పేర్కొన్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement