Friday, March 29, 2024

మోడీని అప్రతిష్టపాలు చేయడానికే…

న్యూఢిల్లి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ రూపొం దించిన డాక్యుమెంటరీ సిరీస్‌పై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీని అపఖ్యాతిపాలు చేసే కథనా న్ని ప్రచారం చేయడం కోసమే ఈ విశ్వసనీయత లేని డాక్యు మెంటరీని ప్రసారం చేశారని దుయ్యబట్టింది. పక్షపాతంతో కూడిన ప్రచార భాగం అని భారత్‌ పేర్కొంది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యు మెంటరీలో వలసవాద మనస్తత్వంతో పాటు అలాంటి ఆలోచన ధోరణి కనిసిస్తోందదని పేర్కొంది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మోడీ ఆ రాష్టానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయన నేతృత్వంలోని ప్రభు త్వంపై ఈ డాక్యుమెంటరీలో తీవ్ర విమర్శలు చేసింది. బ్రిటన్‌ నేషనల్‌ బ్రాడ్‌కాస్టర్‌(బీబీసీ) ప్రధాని మోడీపై ఇండియా: ద మోడీ క్వశ్చన్‌ అనే రెండు భాగాలుగా ఉన్న ఓ డాక్యుమెంటరీ ని ప్రసారం చేసింది.

భారత ప్రధాని నరేంద్ర మోడీ, భారతదేశంలోని ముస్లిం మైనార్టీల మధ్య ఉద్రిక్తతలు, 2002 గుజరాత్‌ అల్లర్లలో మోడీ పాత్ర గురించిన వాదనల పరిశో ధిండం డాక్యుమెంటరీ ముఖ్య ఉద్దేశ్యమని సిరీస్‌లో వివరణ ఇస్తూ ప్రసారమైంది. గుజరాత్‌ అల్లర్లు చెలరేగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని మోడీ ఎలాంటి అక్రమాలకు పాల్పడినట్లు సుప్రీంకోర్టు నియమించిన విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ప్రత్యేక బృందం, అల్లర్లు జరిగిన దశాబ్దం తర్వాత ఒక నివేదికలో ప్రాసిక్యూటబుల్‌ సాక్ష్యాలు లేవని పేర్కొటూ మోడీని నిర్దోషిగా ప్రకటించిం దని, డాక్యుమెంటరీ వెనుక ఉన్న ఎజెండా ఆశ్చర్యం కలిగిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి అన్నారు. ఇది ఒక నిర్దిష్టమైన ప్రాణాళికతో అపఖ్యాతి చేసేందుకు రూపొందించిన ప్రచార భాగమని భావిస్తున్నా మని, పక్షపాతం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద మన స్తత్వ ధోరణి ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు.
గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల సమయంలో మోడీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెం టరీపై బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునక్‌ స్పందించారు. మోడీకి మద్దతుగా నిలిచిన సునక్‌, బీబీసీ డాక్యుమెంటరీలో ఆయన పాత్రధారణతో తాను ఏకీభవిం చడం లేదన్నారు. దీనిపై యూకే ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందని, మారే ప్రసక్తి లేదని అన్నారు. అయితే, మేము ఎక్కడ హింస జరిగినా దాన్ని సహించము అని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement